ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌తో రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

Reliance Industries Ltd Cancelled Rs 24713 Cr Deal with Future Retail Group, Reliance Industries Ltd, Reliance Industries Cancelled Rs 24713 Cr Deal with Future Retail Group, Reliance calls off 24713 crore deal with Future Group, Future Retail Group, Reliance Industries calls off 24713 crore deal, Reliance Industries Calls Off 24713 crore Deal With Kishore Biyanis Future Group, Reliance Industries Ltd Cancelled Rs 24713 Cr Deal, Reliance Industries Ltd Cancels Retail Deal After Future Retail Group, Reliance Industries News, Reliance Industries Latest News, Reliance Industries Latest Updates, Reliance Industries Live Updates, Kishore Biyanis Future Group, Mango News, Mango News Telugu,

ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌తో రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రద్దు చేసుకుంది. ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ యొక్క సురక్షిత రుణదాతల నుండి వ్యతిరేకత కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (FRL)తో ప్రతిపాదిత లావాదేవీని రద్దు చేసింది. ఐదు ఫ్యూచర్ కంపెనీలలో నాలుగింటికి చెందిన సురక్షిత రుణదాతలలో ఎక్కువ మంది రిలయన్స్ గ్రూప్‌కు రిటైల్ మరియు లాజిస్టిక్స్ వ్యాపారాలను విక్రయించడానికి ఫ్యూచర్ గ్రూప్ యొక్క రూ. 25,000-కోట్ల పథకాన్ని ఆమోదించే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆరు లిస్టెడ్ ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల వాటాదారులు బుధవారం ఓటు వేశారు. పెద్ద రుణదాతలందరూ కిషోర్ బియానీ యొక్క ఫ్యూచర్ గ్రూప్‌ను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించడాన్ని రుణదాతలు తిరస్కరించారని బ్యాంకర్లు తెలిపారు.

అయితే, కంపెనీకి చెందిన సురక్షిత రుణదాతలలో 82.75 శాతం మంది ఈ పథకానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఫ్యూచర్ రిటైల్‌లో.. 85.94 శాతం వాటాదారులు విలీన పథకానికి అనుకూలంగా ఓటు వేయగా, సురక్షిత రుణదాతలలో 69.29 శాతం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ పరిణామం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పంద రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 29, 2020న, ఫ్యూచర్ గ్రూప్ యొక్క లాజిస్టిక్స్ మరియు వేర్‌హౌసింగ్ వ్యాపారాన్ని, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ తో పాటు దాని అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్‌కు బదిలీ చేయడానికి ఒక పథకం గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అయితే ప్రస్తుత నిర్ణయం కారణంగా సుమారు 25 వేల కోట్ల భారీ ఒప్పందం రద్దయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here