కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన రోజర్ ఫెదరర్.. భావోద్వేగానికి లోనైన సహచర ఆటగాళ్లు మరియు ప్రేక్షకులు

Roger Federer Played Last Match in His Career Rafael Nadal and Other Players Along with Whole Audience Gets Emotional, Roger Federer Played Last Match, Rafael Nadal and Other Players Gets Emotional, Roger Federer, Rafael Nadal, Mango News, Mango News Telugu, Roger Federer Bids Emotional Farewell, Roger Federer Last Match, Federer Signs Off After Playing Final Game, Alongside Nadal, Federer-Nadal Go Down In Thriller, Nadal Vs Federer , Roger Federer Retirement, Roger Federer Latest News And Updates

స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ కెరీర్‌కు లేవర్ కప్‌తో వీడ్కొలు పలికాడు. తాను ఆడబోయే చివరి టోర్నీ ఇదేనని ఇప్పటికే ప్రకటించిన ఫెదరర్, శుక్రవారం తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడేశాడు. స్పెయిన్ బుల్‌ రఫెల్ నాదల్‌తో కలిసి ‘లేవర్ కప్’ డబుల్స్ మ్యాచ్‌లో ఆడిన ఫెదరర్, ఓటమితో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక సెంటర్ కోర్టు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జాక్స్ సాక్స్- ఫ్రాన్సీస్ టియాఫే జోడీ చేతిలో ఫెదరర్-నాదల్‌ ద్వయం పరాజయం పాలైంది. దాదాపు రెండు గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్-నాదల్ 4-6, 7-6 (7-2), 11-9 తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో లేవర్ కప్‌లో టీమ్ యూరప్‌తో టీమ్ వరల్డ్ 2-2 తేడాతో సమం చేసింది.

అయితే మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. అందరి కళ్ళూ రోజర్ ఫెదరర్ పైనే ఉన్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఫెదరర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. మ్యాచ్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన ఫెదరర్ కన్నీటి పర్యంతం అయ్యాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా మూగపోయింది. కళ్ళనిండా నీళ్లతో, ఏడుపు ఆపుకుంటూ ఫెదరర్ ప్రేక్షకులకు అభివాదం చేశాడు. అలాగే తోటి ఆటగాళ్లతో పాటు అంఫైర్స్ అందరితో కరచాలనం చేశాడు. ఈ క్రమంలో సహచరుడు రఫెల్ నాదల్‌ కూడా కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఫెదరర్ తన భార్య మిర్కాను హత్తుకుని ఆమెకు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపాడు. టెన్నిస్ దిగ్గజం వీడ్కోలు దృశ్యాలను ‘లేవర్ కప్’ ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here