గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్‌ లో తెలంగాణకు 13 అవార్డులు, దేశంలోనే నంబర్ వన్ గా నిలవడంపై సీఎం కేసీఆర్ హర్షం

CM KCR Expressed Happiness for Winning Telangana State 13 Awards under Grameen Swachh Bharat Mission, Grameen Swachh Bharat Mission, CM KCR Praises On 13 Awards In The Grameen Swachh Bharat Mission, Telangana Won 13 Awards in Grameen Swachh Bharat Mission, Telangana 1st Rank In Swachh Survekshan Grameen, Swachh Bharat Mission, Telangana Secures 12 Awards In Sanitation, Waste Management, Telangana Bags 12 Swachh Survekshan Awards, Mango News, Mango News Telugu, Swachh Survekshan, Swachh Survekshan 2022, Telangana Swachh Survekshan, Swachh Survekshan Latest News And Updates, Telangana News And Live Updates

సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, “స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ్” లో మరోసారి దేశంలోనే నంబర్ వన్ గా నిలవడం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు మరోసారి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సమిష్టి కృషితో పల్లె ప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం పునరుద్ఘాటించారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్‌ కింద పలు విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులు దక్కించుకుని, దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

ఇందుకు దోహదం చేసిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచులను, ఎంపీటీసీలను, గ్రామకార్యదర్శులను, సీఎం ఈ సందర్భంగా అభినందించారు. “అప్రతిహత ప్రగతితో ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపరను కొనసాగిస్తాం’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =