కోవిడ్ పై కేంద్రం కీలక ప్రకటన, కమ్యూనిటీలో అన్ని ఒమిక్రాన్ వేరియంట్స్ ఉనికి, వ్యాప్తి పెరుగుదల లేదు

Sentinel Sequencing of 324 COVID Positive Samples Reveals Presence of All Omicron Variants in Community Ministry of Health,Sentinel Sequencing,324 COVID Positive Samples,Reveals Presence of All Omicron Variants,Omicron Variants,Ministry of Health,Mango News,Mango NewsTelugu,BF7 Variant Cases,BF7 Variant Latest News and Updates,Omicron BF7 Symptoms,BF7 Variant Symptoms,BF7 Variant Severity,Omicron BF7 In India,BF7 Covid Variant,Ba 5 1 7 Variant,Omicron New Variant,Omicron New Variant In India,Omicron Bf.7 Symptoms,Bf.7 Variant Severity,Omicron Bf.7 In India,Ba 5.1 7 Variant,Bf.7 Variant,BF7 Variant In India,Bf.7 Variant Covid,Bf.7 Variant Cdc,Bf.7 Variant Canada,Bf.7 Variant Uk,Bf.7 Variant Belgium,Bf.7 Variant Mutations,Covid BF7 Variant,Omicron BF7 Variant,Covid BF7 Variant Symptoms

దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇటీవల 324 కోవిడ్ పాజిటివ్ శాంపిల్స్ యొక్క సెంటినెల్ సీక్వెన్సింగ్ నివేదిక ప్రకారం కమ్యూనిటీలో అన్ని ఓమిక్రాన్ వేరియంట్‌ల ఉనికి ఉందని, అయితే ఈ వేరియంట్స్ కనుగొనబడిన ప్రాంతాలలో మరణాలు లేదా కోవిడ్ వ్యాప్తి పెరుగుదల నివేదించబడలేదని పేర్కొన్నారు.

“2022, డిసెంబర్ 29 నుండి 2023, జనవరి 7 వరకు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడిఎస్పీ) సెంటినెల్ సైట్‌లు 22 ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు సీక్వెన్సింగ్ కోసం 324 కోవిడ్-19 పాజిటివ్ శాంపిల్స్‌ను పంపించాయి. కమ్మూనిటీ నుండి పంపించిన ఈ పాజిటివ్ శాంపిల్స్ యొక్క సెంటినెల్ సీక్వెన్సింగ్ బీఏ.2 మరియు బీఏ.2.75, ఎక్స్ బీబీ(37), బీక్యూ.1 అండ్ బీక్యూ.1.1 (5) మొదలైన సబ్ వేరియంట్స్ సహా అన్ని ఒమిక్రాన్ వైవిధ్యాలు ఉనికిని వెల్లడించింది. ఈ వేరియంట్స్ కనుగొనబడిన ప్రాంతాలలో మరణాలు లేదా వ్యాప్తిలో పెరుగుదల నివేదించబడలేదు” అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

“కేంద్ర ఆరోగ్య శాఖ 2022, డిసెంబర్ 24 నుండి వివిధ విమానాశ్రయాలకు చేరుకునే అంతర్జాతీయ ప్రయాణీకుల ర్యాండమ్ పరీక్షను ప్రారంభించింది. అప్పటి నుండి వివిధ విమానాశ్రయాలలో 7786 విమానాల నుండి 13,57,243 మంది అంతర్జాతీయ ప్రయాణీకులు భారతదేశానికి వచ్చారు, వారిలో 29,113 మంది ర్యాండమ్ గా ఎంపిక చేయబడిన ప్రయాణీకులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించాం. మొత్తం 183 శాంపిల్స్ పాజిటివ్‌గా గుర్తించబడ్డాయి, అవి మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 13 ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపబడ్డాయి. 50 నమూనాల సీక్వెన్సింగ్ రీకాంబినెంట్ వేరియంట్‌లతో సహా ఒమిక్రాన్ మరియు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ ను వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణీకుల యొక్క శాంపిల్స్ లో ముఖ్యంగా ఎక్స్ బీబీ (11), బీక్యూ.1.1 (12) మరియు బీఎఫ్ 7.4.1 (1) ప్రధాన వేరియంట్స్ గా గుర్తించబడ్డాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఐడిఎస్పీ నెట్‌వర్క్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని కోవిడ్-19 పరిస్థితిని ముఖ్యంగా వ్యాప్తిని మరియు ఆసుపత్రిలో చేరే ట్రెండ్‌లను నిశితంగా గమనిస్తోంది” అని ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =