మరో రెండు కోవిడ్-19 వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆమోదం, 7-11 ఏళ్ల పిల్లలకు ఇచ్చేలా కోవోవాక్స్ కు అనుమతి

Serums Covovax Covid-19 Vaccine Gets DCGI Nod for Emergency Use in 7-11 Age Group, Emergency Use in 7-11 Age Group, Serums Covovax Covid-19 Vaccine Gets DCGI Nod for Emergency Use, Covovax Covid-19 Vaccine Gets DCGI Nod for Emergency Use in 7-11 Age Group, Serums Covovax Covid-19 Vaccine, Serums Covovax, 7-11 Age Group, Covid Vaccination in India, Wuhan Virus Vaccination, Wuhan Virus, India COVID-19 Vaccination, Corona Vaccination Programme, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, COVID-19 Vaccination Dose, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Mango News Telugu,

దేశంలో మరో రెండు కోవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవోవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ ను 7 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పరిమితులతో కూడిన అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులిచ్చింది. ముందుగా కోవోవాక్స్ వ్యాక్సిన్ ను 7-11 ఏళ్ల వారికి ఇచ్చేందుకు అనుమతి కోసం మార్చిలో సీరమ్‌ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, కోవిడ్-19పై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) యొక్క సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ పరిశీలన జరిపి అత్యవసర వినియోగ అనుమతి కోసం డీసీజీఐకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా 7-11 ఏళ్ల వారికి కోవోవాక్స్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. మరోవైపు డిసెంబరు 28, 2021న 18 సంవత్సరాలు దాటిన వారికి, మార్చి 9, 2022న 12-17 సంవత్సరాల వారికి అత్యవసర వినియోగం కోసం కోవోవాక్స్ కు డీసీజీఐ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

అలాగే పూణేకు చెందిన జెనోవా బయోఫార్మాస్యూటికల్స్‌ అభివృద్ధి చేసిన దేశంలోని మొట్టమొదటి స్వదేశీ ఎంఆర్‌ఎన్‌ఏ కోవిడ్-19 వ్యాక్సిన్ ను కూడా మంగళవారం డీసీజీఐ పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారికి రెండు డోసులు ఇచ్చేలా జెనోవా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ డీసీజీఐ అనుమతులను పొందింది. ఈ వ్యాక్సిన్ ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా నిల్వ చేసుకోవచ్చని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + one =