ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర రావును మరోసారి స‌స్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

Senior IPS Officer AB Venkateswara Rao Suspended Once Again by AP Govt, IPS Officer AB Venkateswara Rao Suspended Once Again by AP Govt, AB Venkateswara Rao Suspended Once Again by AP Govt, Senior IPS Officer AB Venkateswara Rao Suspended, AB Venkateswara Rao Suspended, Senior IPS Officer Suspended, Senior IPS Officer AB Venkateswara Rao, IPS Officer AB Venkateswara Rao, AB Venkateswara Rao, Senior IPS Officer, IPS Officer, AP Govt, AP govt suspends Senior IPS officer AB Venkateswara Rao yet again, Andhra IPS officer AB Venkateswara Rao, Mango News, Mango News Telugu,

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర రావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే వెంక‌టేశ్వ‌ర రావు క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారని, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుకి సంబంధించి సాక్షులను ప్రభావితం చేయటానికి ప్రయత్నించారని స‌మీర్ శ‌ర్మ చెప్పారు. అయితే చాలా రోజులుగా స‌స్పెన్ష‌న్‌లో ఉన్న ఆయనకు ఇటీవలే ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో వెంక‌టేశ్వ‌ర రావును ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది.

దీనికి ముందు గత టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఇంటెలిజెన్స్ అద‌న‌పు డీజీపీగా ప‌ని చేసిన వెంక‌టేశ్వ‌ర రావుపై అభియోగం మోపుతూ జగన్ సర్కార్ సస్పెన్షన్‌ విధించింది. అప్పట్లో ఇజ్రాయెల్ సంస్థ నుండి నిఘా పరికరాల సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని నేరం మోపింది. కానీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన రెండేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో అతని సస్పెన్షన్‌ను రద్దు చేసింది. ఆలిండియా సర్వీసెస్ (క్రమశిక్షణ మరియు అప్పీల్) ప్రకారం గరిష్టంగా రెండేళ్లు (సస్పెన్షన్) ఉండవచ్చని తీర్పు ఇవ్వడం ద్వారా, హైకోర్టు సస్పెన్షన్‌ను రద్దు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సవరణ నిబంధనలు, 2015 ప్రకారం రెండేళ్ల వ్యవధి ముగిసినందున, ఇకపై సస్పెన్షన్‌ను కొనసాగించలేమని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 8 =