బ్లాక్ ఫంగస్ వ్యాధి విషయంలో చర్యలు తీసుకోండి, ప్రధాని మోదీకి లేఖ రాసిన సోనియాగాంధీ

Sonia Gandhi Writes a Letter to PM Modi over Black Fungus Treatment and Scarcity of Drugs,Sonia Gandhi Writes To Pm Modi Over Scarcity Of Black Fungus,Sonia Gandhi Writes To Pm Modi Over Anti-fungal Drug,Sonia Gandhi Writes To Pm Modi Over Increasing Black Fungus,Provide Free Treatment For Black Fungus,Sonia Gandhi Writes To Pm Modi,Sonia Gandhi Writes To Pm Modi Over Black Fungus,Assure Supply Of Medicines For Black Fungus,Sonia To Pm,Provide Free Treatment For Black Fungus,Assure Supply Of Medicines For Black Fungus,Mango News,Mango News Telugu,Sonia Gandhi Writes a Letter to PM Modi,Black Fungus Treatment,Black Fungus,Black Fungus In India,Sonia Gandhi,Sonia Gandhi Latest News

దేశంలో పలు రాష్ట్రాల్లో మ్యూకోర్ మైకోసిస్‌ (బ్లాక్ ఫంగస్) కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించే మందులకు కొన్ని చోట్ల కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ చికిత్స, మందుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో బ్లాక్ ఫంగస్ బాధితులకు అవసరమైన మందులు, చికిత్సను ఉచితంగా అందించాలని ఆమె కోరారు.

“ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద మ్యూకోర్ మైకోసిస్‌ వ్యాధిని ఎపిడెమిక్ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. దీని అర్థం అందుకు అవసరమైన మందుల తగినంత ఉత్పత్తి మరియు సరఫరాకు భరోసా ఉండాలి. అలాగే ఈ చికిత్స అవసరం ఉన్నవారికి ఉచితంగా చికిత్స అందించేలా ఉండాలి. మ్యూకోర్ మైకోసిస్‌ చికిత్సకు లిపోసోమల్ యాంఫోటెరిసిన్-బి అనే మందు ఖచ్చితంగా అవసరం అని తెలుస్తుంది. అయితే, మార్కెట్లో ఈ మందులకు తీవ్రమైన కొరత ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి. అలాగే ఈ వ్యాధి ఆయుష్మాన్ భారత్ మరియు ఇతర ఆరోగ్య బీమా ప్రొడక్ట్స్ కింద లేదు. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో మ్యూకోర్ మైకోసిస్‌ బారిన పడుతున్న బాధితులకు ఉపశమనం కలిగించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను” అని సోనియాగాంధీ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + fourteen =