తమిళనాడులో మే 24 నుండి 31 వరకు కఠిన ఆంక్షలతో పూర్తిస్థాయి లాక్‌డౌన్

Tamilnadu Govt Announces Complete Lockdown with Strict Restrictions from May 24 to 31,Mango News,Mango News Telugu,Tamil Nadu Government Announces Complete Lockdown,Covid Surge,Complete Lockdown In Tamil Nadu,Tamil Nadu Lockdown News Live,Covid-19,Covid-19 Updates,Covid-19 In Tamil Nadu,Tamil Nadu Covid-19,Tamil Nadu Lockdown,Tamil Nadu Lockdown News,Tamil Nadu Lockdown Live,Tamil Nadu Lockdown Live Updates,Tamil Nadu Lockdown Latest Updates,Tamil Nadu,Tamil Nadu Covid Crisis,Tamil Nadu Extends Lockdown,Tamil Nadu Covid News,Tamil Nadu Coronavirus Cases,Lockdown In Tamil Nadu,Coronavirus In Tamil Nadu,Tamil Nadu News,Covid Tamil Nadu,Tamil Nadu Coronavirus News,Tamil Nadu Lockdown,Tamil Nadu Complete Lockdown From May 24 To May 31

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 10వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వైద్యనిపుణలు, శాసనసభ సభ్యులతో సంప్రదింపులు అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 24 నుండి 31 వరకు తీవ్రమైన ఆంక్షలతో రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు సిద్ధమయ్యేలా మే 21 మరియు 22 తేదీల్లో అవసరమైన దుకాణాలు రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఇక వారం పాటు లాక్‌డౌన్‌ సమయంలో కిరాణా, కూరగాయలు షాపులుకు అనుమతి ఇవ్వలేదు. అలాగే బస్సుల సేవలు కూడా సోమవారం నుండి నిలిపివేయనున్నారు.

తమిళనాడులో మే 24 నుండి 31 వరకు లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు:

  • ఆసుపత్రులు, మెడికల్ షాపులు, వెటర్నరీ మెడిసిన్ షాపులకు అనుమతి.
  • పాల ప్యాకెట్ల పంపిణీ, మంచి నీటి సరఫరాకు అనుమతి ఉంటుంది.
  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు.
  • హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో మొబైల్ వెండింగ్ ద్వారా కూరగాయలు/పండ్లు సరఫరా.
  • అవసరమైన ప్రభుత్వ విభాగాలు మాత్రమే పనిచేయనున్నాయి.
  • ప్రైవేట్ ఆఫీసు ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, బీమా, ఐటి సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉపయోగించుకోవాలని ఆదేశాలు.
  • ఈ-కామర్స్ సేవలు ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు అనుమతి.
  • రెస్టారెంట్లుకు టేక్ అవే/హోమ్ డెలివరీ సేవలకు అనుమతి. ఉదయం 6 నుండి 10 వరకు, మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు అవకాశం.
  • నిరంతర ప్రక్రియ ఉండే పరిశ్రమలుకు/అవసరమైన తయారీ మార్గదర్శకాలకు అనుమతి.
  • వ్యవసాయ ఉత్పత్తుల కార్యకలాపాలకు అనుమతి.
  • అవసరమైన వస్తువుల రవాణాకు సంబంధించిన కార్గో వాహనాలకు అనుమతి.
  • జిల్లాలో వైద్య అవసరాల కోసం ఈ -రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =