శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన దినేష్ గుణవర్ధన

Sri Lanka Dinesh Gunawardena Takes Oath as The New Prime Minister Today, Dinesh Gunawardena Takes Oath as The New Prime Minister Today, Sri Lanka New Prime Minister, New Prime Minister Of Sri Lanka, New Prime Minister, Dinesh Gunawardena Sri Lanka New Prime Minister, Crisis-Hit Sri Lanka's New Prime Minister Dinesh Gunawardena, Sri Lanka's New Prime Minister Dinesh Gunawardena, Dinesh Gunawardena, Dinesh Gunawardena sworn in as Sri Lanka New Prime Minister, Sri Lanka New Prime Minister News, Sri Lanka New Prime Minister Latest News, Sri Lanka New Prime Minister Latest Updates, Sri Lanka New Prime Minister Live Updates, Mango News, Mango News Telugu,

శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్ గుణవర్దన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 73 సంవత్సరాల గుణవర్దన శ్రీలంక రాజకీయాలలో ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు. దీనికి ముందు ఆయన విదేశాంగ మంత్రిగా మరియు విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆయనను హోం మంత్రిగా నియమించారు. ‘పొడుజన పెరమున’ పార్టీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత గుణవర్దన, కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, చట్టసభ సభ్యులు మరియు అధికారుల సమక్షంలో శుక్రవారం సైనిక అధికారుల ముందు కూర్చుని ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే కూడా గత ప్రభుత్వ సభ్యులలో కొందరిని తన మంత్రివర్గం లోకి తీసుకున్నారు. శుక్రవారం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. కాగా శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్ధిక సంక్షోభం చివరికి రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. దేశవ్యాప్తంగా ప్రజలందరూ నెలల తరబడి సామూహిక నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజపక్స ప్రస్తుతం సింగపూర్ లో ఆశ్రయం పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =