తమిళనాడు మంత్రివర్గంలోకి సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, రేపే ప్రమాణస్వీకారం

Tamil Nadu Cabinet Reshuffle on December 14 CM MK Stalin's Son Udhayanidhi Stalin To Be Sworn In As Minister,Tamil Nadu CM Stalin,Udayanidhi Stalin Take Oath,Udayanidhi Stalin Minister,Mango News,Mango News Telugu,Tamil Nadu CM's Son Udhayanidhi Stalin,Tamil Nadu CM,Udhayanidhi Stalin,MK Stalin,Tamil Nadu CM MK Stalin,Udhayanidhi Stalin Tamil Nadu Minister,Tamil Nadu Minister Udhayanidhi Stalin,Udhayanidhi Stalin Sworn as Minister,Tamil Nadu CM MK Stalin's son Udhayanidhi,Tamil Nadu Udhayanidhi,Udhayanidhi Stalin Minister Post,DMK Party,Breaking News Highlights,MK Stalin's Son Udhayanidhi,Tamil Nadu CM Latest News and Updates

తమిళనాడు రాష్ట్రంలో సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో డీఎంకే యూత్ వింగ్ లీడర్, ఎమ్మెల్యే, సినీనటుడు, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా రాష్ట్ర మంత్రివర్గంలోకి చేరనున్నారు. గతఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్-తిరువల్లికేణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఉదయనిధి స్టాలిన్ ను మంత్రివర్గంలో చేర్చాలని సీఎం స్టాలిన్ గవర్నర్‌ ఆర్.ఎన్ రవికి సిఫార్సు చేయగా, గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపినట్టు సోమవారం రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.

దీంతో బుధవారం ఉదయం 9.30 గంటలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయనిధికి యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మరియు స్పెషల్ ప్రోగ్రాం ఇంప్లీమెంటేషన్ పోర్ట్‌ఫోలియోలు అప్పగించనున్నట్టు తెలుస్తుంది. చిత్ర నిర్మాతగా, పంపిణీదారుగా, నటుడిగా ఉన్న ఉదయనిధి గత ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో చోటుదక్కనప్పటికీ, ఏడాది తర్వాత తాజాగా తొలిసారిగా చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా తన కుమారుడు ఉదయనిధికి మంత్రి పదవి ఇవ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =