ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు చట్ట భద్రత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ

AP Govt Issues Ordinance Regarding Security For The Village and Ward Secretariat System,Key Decision Of Ap Govt,Ordinance Issued, Providing Legal Security,Village And Ward Secretariat System,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థకు చట్ట భద్రత కల్పిస్తూ ఆర్డినెన్స్ చేసింది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాల మేరకు సోమవారం ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ నెంబరు 15/2022కు గవర్నర్‌ ఈనెల 5న సంతకం చేశారు. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూల్ ప్రకారం చట్టం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలకు చట్ట భద్రత లభిస్తుందని ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో దీనికి సంబంధించిన బిల్లుని సభలో ప్రవేశపెట్టనుంది. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ చట్టాల తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు కూడా ప్రత్యేక చట్టం అందుబాటులోకి రానుంది.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో 2019 అక్టోబర్‌ 2వ తేదీ నుంచి సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, ఒక్కోదానిలో 10 నుంచి`11 మంది ఉద్యోగులను నియమించింది. దీనికోసం 1.34 లక్షల మందిని వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసింది. అనంతరం వారికి ప్రొబేషన్ పీరియడ్ విధించి, మరోసారి పరీక్ష నిర్వహించి వారిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించింది. వీటిల్లో పనిచేస్తున్న సిబ్బంది పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖల పరిధిలో ఉన్న సచివాలయాల ద్వారా 540 రకాల సేవలందించనున్నారు. తాజాగా ఈ వ్యవస్థకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను 2019 జిఓ ఎంఎస్‌ నెంబరు 110 పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ తేదీ 19.07.2019 జిఓ ఎంఎస్‌ నెంబరు 217, జిఓ ఎంఎస్‌ నెంబరు 217మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తేదీ 20.07.2019, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జిఓ 156 తేదీ 21.12.2019 ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మ్యుటేషన్లు, సవరణలు, ల్యాండ్‌ టైటిల్స్‌, ఇంటిగ్రేటెడ్‌, ఇన్‌కమ్‌, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌, కంప్యూటరైజ్డ్‌ అడంగల్‌, ఓబిసి సర్టిఫికెట్లు, వ్యవసాయ భూములకు నీటిపన్నుల చెల్లింపులు, ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, విద్యుత్‌ బిల్లులు, ఎఫ్‌లైన్‌ ధరకాస్తులు, రైస్‌ కార్డుల మంజూరు, సదరం సర్టిఫికెట్లు, ఇసుక బుకింగ్‌, ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్స్‌, వితంతు, వృద్ధాప్య పించన్ల పంపిణీ వంటి సేవలతో పాటు ఇతర సిటిజన్‌ సర్వీసులను అందిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =