ఇండియాలో ఎక్కువ జీతం ఆ నగరంలోని వారికేనట..

The Highest Salary in India Belongs to The People of That City,The Highest Salary in India,Highest Salary in India,Highest Salary Belongs to That City,People of That City,Mango News,Mango News Telugu,Which city has the highest salaries,Average salary is very low,Management and Business Legal Profession,Salary details of CEOs,Average annual salary,Average salary is very low,Computer Architects,Highest Salary in Mumbai,Highest Salary in Solapur,Highest Salary in India News Today,Highest Salary in India Latest News,Highest Salary in India Latest Updates

ఇప్పుడు ఎక్కడ చూసినా ఉద్యోగం చేస్తున్నవాళ్లే కనిపిస్తున్నారు. ఒకప్పుడు మగవాళ్లు మాత్రమే ఉద్యోగం చేయాలి. ఆడవాళ్లు ఇంటి పనులు చూసుకోవాలి అనే కల్చర్ నుంచి ఆడ, మగ ఇద్దరూ ఉద్యోగం (Both men and women are employed) చేయాలి. అప్పుడు కుటుంబానికి చేదోడు వాదోడు అన్న మాటకు అలవాటు పడిపోయారు. పోటాపోటీగా ఉద్యోగాలు చేస్తూ వేలల్లో, లక్షల్లో జీతాలు అందుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఓ సర్వేలో దేశ ప్రజల సగటు వార్షిక జీతం ఎంత? ఆడ, మగ వారిలో ఎవరు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు? అసలు ఏ నగరంలో జీతాలు ఎక్కువ (Which city has the highest salaries?) తీసుకుంటున్నారనే విషయాలపై సర్వే నిర్వహించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

2022 జూన్.. 2023 జూన్ వరకూ నిర్వహించిన ఒక సర్వేలో.. ఇండియాలో ఉద్యోగుల సగటు వార్షిక జీతం (Average annual salary)ఎంత? ఆ లిస్టులో టాప్‌లో ఏ నగరం ఉంది? అనే ఇంట్రస్టింగ్ విషయాలు తెలిసాయి. ఈ రిపోర్ట్ ప్రకారం.. భారత దేశంలో సుమారు 11, 570 సర్వేల నుంచి తీసుకున్న డేటా ఆధారంగా (Based on the data).. ఒక నివేదికను రూపొందించారు. దీనిలో పురుషుల యావరేజ్ శాలరీ రూ. 19,53,055 కాగా.. మహిళల యావరేజ్‌గా ఇందులో రూ. 15,16,296 శాలరీ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే పురుషులతో పోలిస్తే.. మహిళల సరాసరి జీతం చాలా తక్కువ (Average salary is very low)గా ఉన్నట్లు క్లియర్‌గా అర్ధమవుతుంది. దీంతో ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అనే మాటలు లాగే.. తమ జీతాలు సగమేనా అంటూ మహిళలు పెదవి విరుస్తున్నారు.

మరోవైపు ఏ డిపార్టుమెంట్లలో ఎక్కువ జీతాలు ఇస్తున్నారనే విషయానికి వస్తే.. మేనేజ్​మెంట్ అండ్ బిజినెస్ (Management and Business) వంటి రంగాలలో పని చేస్తున్న వారి జీతాలు మిగిలిన వారి కంటే బాగా ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తెలిసింది. ఈ రెండిటి తర్వాత న్యాయ వృత్తి (Legal Profession)లో ఉన్న వాళ్లు.. మూడవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదాయం పరంగా ఎక్స్పీరియన్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అదే కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం. అంటే 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికి ఎక్కువ జీతాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

అలాగే ఇక నగరాలలో ఎక్కువ జీతం పొందుతున్న జాబితాను చూసుకుంటే.. మహారాష్ట్రలోని టైర్ 2 నగరమైన సోలాపూర్ (Solapur) ‌లో రూ. 28,10,000తో ఎక్కువ యావరేజ్ వార్షిక వేతన ప్యాకేజీని కలిగి ఉందట. ఇక రూ. 21.17 లక్షల యావరేజ్ వార్షిక వేతనంతో రెండో స్థానంలో ముంబై (Mumbai) ఉండగా.. రూ. 21.01 లక్షల వార్షిక శాలరీతో బెంగళూరు 3వ స్థానంలో నిలబడిందట.

ఈ సర్వేను.. సుమారు 59 మంది సీఈఓల జీతాల వివరాలు (Salary details of CEO’s) సేకరించి.. రిపోర్టును తయారు చేశారట అంటే వారి సగటు వార్షిక జీతం రూ. 60,48,703గా ఉండటంతో… దీని ప్రకారం ఎక్కువ శాలరీ పొందుతున్న వారుగా సీఈఓలు టాప్‌లో నిలిచారు. ఆ తరువాత రూ. 58,50,925 జీతంతో.. డైరెక్టర్లు (Directors) రెండో ప్లేసులో నిలవగా.. రూ. 42,35,740 వార్షిక జీతంతో జనరల్ మేనేజర్లు.. వారి తర్వాత రూ. 33,37,499 వార్షిక శాలరీతో కంప్యూటర్​ ఆర్కిటెక్ట్ ​(Computer Architects)లు ఉన్నారు. అలాగే రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేసులోనూ.. పశ్చిమ బెంగాల్ సెకండ్ ప్లేస్, ఆ తరువాత మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 3 =