ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది.. ఏంటో తెలుసా?

There is A New Update on The Income Tax Website Do You Know What,There is A New Update,Update on The Income Tax Website,Income Tax Website,Do You Know What,Mango News,Mango News Telugu,Income Tax E-Filing Portal,Income Tax Return,Tax returns status,How to File ITR,Income Tax Website Latest News,Income Tax Website New Update,Income Tax Website New Update News Today,Income Tax India,Income Tax India Latest News,Income Tax India Latest Updates,Income Tax India Live News

చాలామందిలో ట్యాక్స్‌ రిటర్న్స్‌ స్టేటస్‌ ఎలా తెలుసుకోవాలన్న అనుమానాలు ఉంటాయి. అయితే ఇలాంటి వారికోసం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌ (Income Tax Website)లో కొత్త అప్‌డేట్‌ (New update) వచ్చేసింది. దీంతో ఈజీగా మన ట్యాక్స్‌ రిటర్న్స్‌ స్టేటస్‌ (Tax returns status) ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ (Income Tax E-Filing Portal) లోకి వెళ్లాలి. తర్వాత ట్యాక్స్‌ రిటర్న్స్‌ యెక్క స్థితి అని కనిపించేంత వరకూ క్విక్ లింక్స్ (Quick links) నొక్కుతూ కిందకు స్క్రోల్ చేస్తూ ఉంటాలి. ట్యాక్స్‌ రిటర్న్స్‌ స్టేటస్‌ కనిపించాక అప్పుడు ఆ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత మీ పాన్‌ నంబర్, ప్రస్తుత సంవత్సరానికి 2023-24 అసెసెమెంట్ ఇయర్ (Assessment Year)ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత మీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే ట్యాక్స్‌ రిటర్న్స్‌ స్టేటస్‌ తెలుస్తుంది. అయితే ఐటీఆర్ బ్యాంక్ వివరాలలో ఏదైనా సమస్య ఉంటే.. వెంటనే రికార్డులో ఏమీ కనుగొనబడలేదన్న నోటిఫికేషన్ చూపిస్తుంది. లేదంటే మీ ట్యాక్స్‌ రిటర్న్స్‌ స్టేటస్‌ (Tax returns status) చూపిస్తే.. ఈ ఫైల్‌ను నావిగేట్ చేసి.. మీ ఈ ఫైలింగ్ ప్రాసెస్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

ఇండియాలో చాలామందికి వారంతట వారే ఐటీఆర్‌ను ఫైల్ (File the ITR) చేయడం అలవాటు. అలా దాదాపు 11.22 కోట్ల మంది తామే పర్సనల్‌గా ఐటీఆర్ దాఖలు చేసుకుంటూ ఉంటారు. అలా ఈ ఏడాది 2023-24 ఐటీఆర్‌ని ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్.. జులై 31 వరకూ మాత్రమే ఉంది. అయితే ఈ ప్రాసెస్ అంతా ముందే చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది డెడ్ లైన్ వరకూ వెయిట్ చేసి చివర్లో ఆదరాబాదరాగా పనులు ముగించడానికి ట్రై చేస్తుంటారు. అందుకే జులై 20 తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

నిజానికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఏడు రకాలు ఫామ్స్ ఉంటాయి. ప్రతీ ఫామ్ డిఫరెంట్‌గా కొద్దిపాటి నియమ నిబంధనలు ఉంటాయి. అందుకే మీకు.. మీ ఇయర్లీ వచ్చిన ఆదాయాన్ని బట్టి ఏ ఫారమ్ మీకు కరెక్టో అని గుర్తించి.. అప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఓన్లీ జీతం వల్లే ఆదాయం ఉన్నవారు ఐటీఆర్‌-1ని ఉపయోగించి.. ఇన్‌కమ్ ట్యాక్స్‌ను దాఖలు చేయవచ్చు. అలాగే ఇతర మార్గాలలోనూ ఆదాయం వచ్చినవారు.. వారికి తగ్గట్టు ఐటీఆర్‌ ఫైల్ చేయడానికి వేరే వేరు ఫామ్‌లను ఉపయోగించి ఫైల్ చేయాలంటారు నిపుణులు. లేకపోతే ఒకదానికి ఒకటి ఫిల్ చేసి పంపితే ఆదాయపు పన్ను అధికారుల నుంచి నోటీసులు కూడా పంపే అవకాశం ఉంటుందట. అందుకే ఇలాంటి సున్నితమైన అంశాలను ముందే అర్ధం చేసుకుని ఐటీఆర్‌ను జాగ్రత్తగా ఫైల్ చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =