మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్, తండ్రి సీఎం స్టాలిన్ కేబినెట్‌లో చోటు

Udhayanidhi Stalin Sworn in as Minister Today Joins Father and Tamil Nadu CM Stalin's Cabinet,Tamil Nadu CM Stalin,Udayanidhi Stalin Take Oath,Udayanidhi Stalin Minister,Mango News,Mango News Telugu,Tamil Nadu CM's Son Udhayanidhi Stalin,Tamil Nadu CM,Udhayanidhi Stalin,MK Stalin,Tamil Nadu CM MK Stalin,Udhayanidhi Stalin Tamil Nadu Minister,Tamil Nadu Minister Udhayanidhi Stalin,Udhayanidhi Stalin Sworn as Minister,Tamil Nadu CM MK Stalin's son Udhayanidhi,Tamil Nadu Udhayanidhi,Udhayanidhi Stalin Minister Post,DMK Party,Breaking News Highlights,MK Stalin's Son Udhayanidhi,Tamil Nadu CM Latest News and Updates

తమిళనాడులో రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాలుగు సంవత్సరాల క్రితం రాజకీయ అరంగేట్రం చేసిన డీఎంకే అధినేత కుటుంబానికి చెందిన వారసుడు, ఉదయనిధి స్టాలిన్ బుధవారం తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో చేరారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి ఈ ఉదయం 9:30 గంటలకు డీఎంకే శాసనసభ్యుడు, పార్టీ యువజన విభాగం కార్యదర్శి అయిన ఉదయనిధి స్టాలిన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో అత్యంత సాధారణంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు ఆయన మంత్రివర్గ సహచరుల సమక్షంలో ఉదయనిధి ప్రమాణం చేశారు. కేవలం 10 నిమిషాల్లో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం ముగియడం విశేషం. ఇక ప్రమాణస్వీకారం అనంతరం ఉదయనిధిని రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు అభినందించారు.

ఈ సందర్భంగా ఆయనకు తమిళనాడు క్రీడల శాఖ మంత్రి పదవి అప్పగించారు. గతేడాది తమిళనాడు అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో చేపాక్-తిరువల్లికేణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఈ నియోజకవర్గం నుంచి ఆయన తాత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రాతినిథ్యం వహించారు. కాగా ఉదయనిధి రాజకీయాల్లోకి రాకముందు నటుడిగా కొన్ని విజయవంతమైన చిత్రాల్లో కూడా పనిచేశారు. అయితే ఉదయనిధి స్టాలిన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ప్రధాన ప్రతిపక్షం ‘అన్నా డీఎంకే’ తీవ్ర విమర్శలు చేసింది. వారి కుటుంబం నుంచి మూడో తరం ప్రతినిధిని రంగంలోకి దించారని మండిపడింది. అలాగే తమిళనాడు ప్రజలు వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + thirteen =