యూకేలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు అనుమతి, త్వరలోభారత్ లో కూడా ఆమోదించే అవకాశం?

UK Govt Approves Oxford-AstraZeneca Covid-19 Vaccine,UK Nod To Oxford-AstraZeneca Covid-19 Vaccine Strengthens Case For India Approval,Oxford-AstraZeneca Covid-19 Vaccine Approved In UK,Nod In India Expected Soon,Astrazeneca-Oxford Developed Covid-19 Vaccine,Mango News,Mango News Telugu,UK Govt,Oxford-AstraZeneca,Covid-19 Vaccine,Covid-19,Oxford-AstraZeneca Coronavirus vaccine,Coronavirus vaccine,Oxford-AstraZeneca,Oxford-AstraZeneca Covid-19 Vaccine,Britain Approves Oxford-AstraZeneca Covid-19 Vaccine,UK Approves Oxford Vaccine For Emergency Use,UK Regulator Approves Oxford-AstraZeneca Coronavirus,UK Govt,UK Govt Approves Oxford Covid-19 Vaccine

యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణతో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన యూకే ప్రభుత్వం తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ కు కూడా ఆమోదం తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపామని, వచ్చే వారం నుంచి ఈ వ్యాక్సిన్‌ పంపిణీ కూడా ప్రారంభించనున్నట్టు యూకే ప్రభుత్వం బుధవారం నాడు వెల్లడించింది.

త్వరలో భారత్ లో కూడా అనుమతి?

మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్‌ రెండు మరియు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్ ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) దేశంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. కోవిషిల్డ్ పేరుతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ కు అనుమతిపై నిర్ణయం తీసుకునేందుకు డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ బుధవారం నాడు సమావేశమైనట్టు సమాచారం. యూకేలో ఈ వ్యాక్సిన్ కు అనుమతులు లభించడంతో దేశంలో కూడా తొలి అనుమతులు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ కే వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here