కొత్తరకం కరోనా వైరస్ : దేశంలో ఇప్పటికి 20 మందికి పాజిటివ్

New Coronavirus Strain in India: 20 People Tested Positive so far,New Coronavirus Strain in India,Coronavirus Strain In India, Coronavirus In India,New Coronavirus Strain India Live Updates,New Coronavirus Strain Live Updates,New Coronavirus Strain Positive Cases List,COVID-19,New COVID-19 Strain Cases in India,COVID-19 Daily Bulletin,Covid-19 In India,Covid-19 Latest Updates,COVID-19 New Live Updates,Covid-19 Positive Cases,India New Coronavirus Strain,India COVID 19,India Covid-19,India New Covid-19 Strain Latest Reports,India New COVID-19 Strain Reports,India Covid-19 Updates,India New COVID 19 Cases,Mango News,India New Covid-19 Strain 20 Positive Cases

యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుండి భారత్ కు వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మందిలో కొత్తరకం కరోనా వైరస్ (కొత్త ‌యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. ఢిల్లీలోని ఎన్‌సీడీసీలో ఎనిమిది, బెంగళూరులోని నింహన్స్‌ ల్యాబ్ లో ఏడు, హైదరాబాద్ ‌లోని సీసీఎంబీలో రెండు, పూణేలోని ఎన్‌ఐవీలో ఒకటి, ఢిల్లీలోని ఐజీఐబీలో ఒకటి, కోల్‌కతాలోని ఎన్‌ఐబిఎంజిలో ఒక కేసు నిర్ధారణ అయినట్లుగా తెలిపారు. పాజిటివ్ గా తేలిన వ్యక్తులందరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో ఉంచినట్టు తెలిపారు. అలాగే వారితో కాంటాక్ట్ అయిన వాళ్లంద‌రినీ కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పారు.

మరోవైపు నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 అర్ధరాత్రి వరకు సుమారు 33,000 మంది ప్రయాణికులు యూకే నుండి వివిధ రాష్ట్రాలకు చేరుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రయాణీకులందరినీ ఆయా రాష్ట్రాలు/యుటిలు గుర్తించి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. ముందుగా కరోనా పాజిటివ్ గా తేలిన వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం దేశంలోని 10 ఇన్సాకోగ్ ల్యాబ్‌లకు (ఎన్‌ఐబిఎంజి కోల్‌కతా, ఐఎల్ఎస్ భువనేశ్వర్, ఎన్‌ఐవి పూణే, సిసిఎస్ పూణే, సిసిఎంబి హైదరాబాద్, సిడిఎఫ్‌డి హైదరాబాద్, ఇన్‌స్టెమ్ బెంగళూరు, నింహన్స్‌ బెంగళూరు, ఐజీఐబీ ఢిల్లీ, ఎన్‌సీడీసీ ఢిల్లీ) పంపిస్తున్నారు. కొత్తరకం కరోనా వైరస్ పరిస్థితి ప్రస్తుతం పరిశీలనలో ఉందని, మెరుగైన నిఘా, నియంత్రణ, పరీక్షలు మరియు శాంపిల్స్ ను ఇన్సాకోగ్ ల్యాబ్‌లకు పంపించడం కోసం రాష్ట్రాలకు క్రమం తప్పకుండా సలహాలు ఇస్తున్నామని కేంద్రం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here