ఉక్రెయిన్ సంక్షోభం: భారత్ లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆనంద్ మహీంద్రా

Ukraine Crisis Industrialist Anand Mahindra Proposes For A New Medical Institution in India, Industrialist Anand Mahindra Proposes For A New Medical Institution in India, Anand Mahindra Proposes For A New Medical Institution in India, Industrialist Anand Mahindra, A New Medical Institution in India, New Medical Institution, Anand Mahindra, New Medical Institution in India, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వైద్య విద్యార్థి రష్యా సైనిక చర్య కారణంగా మరణించడంతో భారతదేశ వైద్య విద్యా వ్యవస్థపై ఇప్పుడు అందరి చూపు పడింది. ఈ సంఘటన భారతదేశ వైద్య విద్యా వ్యవస్థ లోని మౌలిక లోపాలను బహిర్గతం చేయడంతో పలువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలో ఒక సరైన వైద్య విద్యా వ్యవస్థ ఉండాలని మేథావులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. భారత వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, ఆనంద్ మహీంద్రా కూడా భారతదేశంలో వైద్య కళాశాలల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. మహీంద్రా యూనివర్శిటీ క్యాంపస్‌లో మెడికల్ స్టడీస్ ఇన్‌స్టిట్యూషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన తలపోస్తున్నారు.

ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు.. “భారతదేశంలో వైద్య కళాశాలల కొరత ఉందని నాకు తెలియదు. ఎందుకని ఇంతమంది మన విద్యార్థులు మెడిసిన్‌ చదివేందుకు ఇతర దేశాలకు వెళ్తున్నారు? ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీన్ని అధిగమించేందుకు మహీంద్రా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో వైద్య అధ్యయన సంస్థను స్థాపించే ఆలోచనను మనం అన్వేషించగలమా?” అని అన్నారు. ఈ వివరాలు పరిశీలించాంటూ టెక్‌ మహీంద్రా చీఫ్‌ సీపీ గుర్నానిని ఆదేశించారు. ప్రస్తుతం మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్‌ హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉంది. ఆనంద్‌ మహీంద్రా ఆలోచన కార్యరూపం దాల్చితే హైదరాబాద్‌ క్యాంపస్‌లోనే మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ఆస్కారం ఉంది.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 18,095 మంది భారతీయ విద్యార్థులలో 90% మంది మెడిసన్‌ చదువుతున్నారు. యుద్ధ భయంతో భారత ప్రభుత్వం ఉక్రెయిన్‌లో ఉంటున్న వేలాది మంది విద్యార్థులను ఖాళీ చేయించింది. ఈ విద్యార్థులు భారత్ కు తిరిగి రావటానికి విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలను చేరుకోవడానికి రొమేనియా, పోలాండ్ మరియు ఇతర పొరుగు దేశాలకు మైళ్ల దూరం నడిచారు. అయితే మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్‌కు వెళ్లిన విద్యార్థులలో మరికొంత మంది ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయి భయంతో జీవిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =