రేపు దేశవ్యాప్తంగా అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహణ

Union Health Minister Mansukh Mandaviya Says Mock Drill will be conducted Across the Country at all COVID Hospitals Tomorrow,Union Health Minister Mansukh Mandaviya,Mock Drill At all COVID Hospitals,COVID Across the Country,Mango News,Mango News Telugu,BF7 Variant Cases,BF7 Variant Latest News and Updates,Omicron BF7 Symptoms,BF7 Variant Symptoms,BF7 Variant Severity,Omicron BF7 In India,BF7 Covid Variant,Ba 5 1 7 Variant,Omicron New Variant,Omicron New Variant In India,Omicron Bf.7 Symptoms,Bf.7 Variant Severity,Omicron Bf.7 In India,Ba 5.1 7 Variant,Bf.7 Variant,BF7 Variant In India,Bf.7 Variant Covid,Bf.7 Variant Cdc,Bf.7 Variant Canada,Bf.7 Variant Uk,Bf.7 Variant Belgium,Bf.7 Variant Mutations,Covid BF7 Variant,Omicron BF7 Variant,Covid BF7 Variant Symptoms

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కొత్త వేరియంట్ ప్రభావంతో కోవిడ్ వ్యాప్తి ఉద్ధృతమైతే సన్నద్ధంగా ఉండడంలో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలో కోవిడ్ ఆసుపత్రుల్లో మాక్​డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు (డిసెంబర్ 27, మంగళవారం) దేశవ్యాప్తంగా అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించబడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ మాక్ డ్రిల్ లో అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు కూడా తమ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు.

ముందుగా కోవిడ్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహణపై రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు డిసెంబర్ 24న కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ ఒక లేఖ రాశారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతుండడంతో, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రజారోగ్య చర్యలను అమలు చేయడం అవసరమని పేర్కొన్నారు. కేసుల పెరుగుదల కారణంగా రాష్ట్రాలు/జిల్లాలు క్లినికల్ కేర్ అవసరాలను పెంచడానికి సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించడానికి కోవిడ్-19 హెల్త్ ఫెసిలిటీస్ సన్నద్ధత చాలా కీలకమని అన్నారు. అందువలన డిసెంబర్ 27, మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని హెల్త్ ఫెసిలిటీస్ వద్ద (గుర్తించబడిన కోవిడ్ డేడికేటెడ్ హెల్త్ ఫెసిలిటీస్ తో సహా) మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మాక్ డ్రిల్ యొక్క లక్ష్యం కోవిడ్ నిర్వహణ కోసం ఈ హెల్త్ ఫెసిలిటీస్ కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడమేనని పేర్కొన్నారు.

ఈ మాక్ డ్రిల్ సందర్భంగా బెడ్ కెపాసిటీలు, ఐసోలేషన్ బెడ్‌లు, ఆక్సిజన్ సపోర్టెడ్ ఐసోలేషన్ బెడ్‌లు, ఐసీయూ బెడ్‌లు, వెంటిలేటర్ సపోర్టెడ్ బెడ్‌లు లభ్యత మరియు వైద్యులు, నర్సులు, పారామెడిక్స్, ఆయుష్ వైద్యులు, ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు మొదలైన వారితో సహా ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికులు లభ్యతపై దృష్టి పెట్టాలని తెలిపారు. కోవిడ్-19 నిర్వహణపై శిక్షణ పొందిన హెల్త్‌కేర్ నిపుణులు, తీవ్రమైన కేసుల కోసం వెంటిలేటరీ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో శిక్షణ పొందిన హెల్త్‌కేర్ నిపుణులు, పీఎస్ఏ ప్లాంట్ల ఆపరేషన్‌లో శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తల అందుబాటును గుర్తించాలన్నారు. అధునాతన మరియు బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌ల లభ్యత, ఇతర అంబులెన్స్‌ల లభ్యత (పీపీపీ మోడ్‌లో లేదా ఎన్జీఓలతో). ఫంక్షనల్ అంబులెన్స్ కాల్ సెంటర్ లభ్యతను పరిశీలించాలని తెలిపారు.

అదేవిధంగా కోవిడ్ టెస్టింగ్ లేబొరేటరీల సంఖ్య మరియు సామర్థ్యాలు, ఆర్టీ-పీసీఆర్, ర్యాండమ్ యాంటిజెన్ టెస్ట్ కిట్‌ల లభ్యత, టెస్టింగ్ పరికరాలు, రియాజెంట్ల లభ్యతను, అవసరమైన మందులు, వెంటిలేటర్లు, బైపాప్, ఎస్పీఓ2 సిస్టమ్స్, పీపీఈకిట్లు, ఎన్- 95 మాస్క్‌లు లభ్యతను సరిచూసుకోవాలన్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకులు, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టమ్ పై దృష్టి సారించాలని చెప్పారు. ఈ మాక్ డ్రిల్ ను సంబంధిత జిల్లా కలెక్టర్లు/జిల్లా మేజిస్ట్రేట్ల మార్గదర్శకత్వంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదింపులతో చేయవచ్చని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =