అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కు కరోనా పాజిటివ్​ గా నిర్ధారణ

United States of America President Joe Biden Tests Positive for COVID-19, President Joe Biden Tests Positive for COVID-19, US President Joe Biden Tests Positive for Covid-19, US President Joe Biden, Joe Biden Tests Positive for Covid-19, US President, US President Tests Positive for Covid-19, Positive for Covid-19, Joe Biden, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19 Latest Updates, US President Joe Biden Tests Positive For Coronavirus, Positive For Coronavirus, Joe Biden Corona Positive, Joe Biden Coronavirus, Joe Biden Covid 19, Joe Biden Covid 19 Positive, Joe Biden Covid News, Joe Biden Covid Positive, Joe Biden Health, Joe Biden Health Condition, Joe Biden Health News, Joe Biden Health Reports, Joe Biden Latest Health Condition, Joe Biden Latest Health Report, Joe Biden Latest News, Joe Biden Latest Updates, Joe Biden Positive For COVID-19, Joe Biden Tested Positive for Covid-19, Joe Biden Tests Coronavirus Positive, Joe Biden Tests Covid 19 Positive, Joe Biden Tests COVID Positive, Joe Biden Tests Positive, Joe Biden Tests Positive For Coronavirus, Joe Biden tests positive for Covid 19, Mango News, Mango News Telugu,

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్​ కు కరోనా పాజిటివ్​ గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు శుక్రవారం అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జో బైడెన్‌ కు తేలికపాటి కరోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయని, ఆయన ప్రస్తుతం అధ్య‌క్ష భ‌వ‌నంలోనే ఐసోలేష‌న్‌లో ఉన్నట్లు ప్రెస్​ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తెలిపారు. అలాగే జో బైడెన్ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ తో పాటుగా రెండు సార్లు బూస్ట‌ర్ డోస్‌ను కూడా తీసుకున్నారని చెప్పారు.

“ఈ ఉదయం ప్రెసిడెంట్ బైడెన్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అతను రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ మరియు రెండుసార్లు బూస్ట‌ర్ డోస్‌ తీసుకున్నారు. చాలా తేలికపాటి లక్షణాలను కలిగివున్నారు. అతను పాక్స్లోవిడ్ తీసుకోవడం ప్రారంభించారు. సీడీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బైడెన్ వైట్ హౌస్‌లోనే ఐసోలేషన్ లో ఉంటారు మరియు ఆ సమయంలో తన విధులన్నింటినీ పూర్తిగా కొనసాగిస్తారు. అతను ఈ ఉదయం వైట్ హౌస్ సిబ్బంది సభ్యులతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు మరియు ఈ ఉదయం వైట్ హౌస్‌లో తన ప్రణాళికాబద్ధమైన సమావేశాలలో ఫోన్ మరియు నివాసం నుండి జూమ్ ద్వారా పాల్గొంటారు” అని తెలిపారు.

“పాజిటివ్ కోవిడ్ కేసుల కోసం వైట్ హౌస్ ప్రోటోకాల్‌కు అనుగుణంగా, సీడీసీ మార్గదర్శకానికి మించి, బైడెన్ కు పరీక్షలో నెగటివ్ వచ్చేంత వరకు ఐసోలేషన్ లో ఉండి పని చేస్తూనే ఉంటారు. ఒకసారి అతను నెగిటివ్‌గా పరీక్షించినట్లయితే, అతను వ్యక్తిగత పనికి తిరిగి వస్తారు. పారదర్శకత దృష్ట్యా అధ్యక్షుడి పరిస్థితిపై వైట్ హౌస్ రోజువారీ అప్ డేట్స్ అందిస్తుంది, ఎందుకంటే అతను ఐసోలేషన్ లో ఉన్నప్పుడు కార్యాలయం యొక్క పూర్తి విధులను కొనసాగిస్తున్నారు. వైట్ హౌస్‌లో ఏదైనా పాజిటివ్ కేసు కోసం ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం, వైట్ హౌస్ మెడికల్ యూనిట్ ఈ రోజు అధ్యక్షుడికి సంబంధించిన అన్ని సన్నిహిత కాంటాక్ట్స్ ను తెలియజేస్తుంది, ఇందులో కాంగ్రెస్ సభ్యులు మరియు నిన్నటి ప్రయాణంలో అధ్యక్షుడితో సంభాషించిన ప్రెస్ సభ్యులెవరైనా ఉన్నారా అని కూడా తెలుస్తుంది. ఇక అధ్యక్షుడు బైడెన్ కోసం చివరి కోవిడ్ పరీక్ష మంగళవారం చేయగా, అందులో అతనికి నెగటివ్ ఫలితం వచ్చింది” అని వైట్ హౌస్ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కోవిడ్-19 నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “కోవిడ్-19 నుండి త్వరగా కోలుకోవాలని జో బైడెన్ కి నా శుభాకాంక్షలు మరియు అతని మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 1 =