భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ, అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు

Wishes Pour in for Droupadi Murmu on being Elected as New President of the Country, Droupadi Murmu on being Elected as New President of the Country, Wishes Pour in for Droupadi Murmu, Wishes Pour In As Droupadi Murmu on being Elected 15th New President of India, Wishes pour in across party lines for Droupadi Murmu, Presidential poll victory, Droupadi Murmu's victory in the Presidential elections drew best wishes from major opposition leaders, Presidential elections 2022, 2022 Presidential elections, Presidential elections, NDA Presidential candidate Droupadi Murmu, Droupadi Murmu, Droupadi Murmu Latest News, President Droupadi Murmu, New president of india, president of india 2022, president of india, Mango News, Mango News Telugu,

గురువారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రధాని మోదీ గురువారం రాత్రి ముర్ము నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు అని మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ తెలిపారు.

“భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక అభినందనలు. ముర్ము జీ! ప్రజా జీవితంలో ఆమెకున్న విస్తృత అనుభవం, నిస్వార్థ సేవా స్ఫూర్తి, ప్రజల సమస్యలపై లోతైన అవగాహన దేశానికి ఎంతో మేలు చేస్తాయి. ఆమె విజయవంతమైన పదవీకాలం కోసం నా శుభాకాంక్షలు” అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

అలాగే ముర్ముపై పోటీ చేసిన యశ్వంత్ సిన్హా కూడా ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పడం విశేషం. “2022 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌లో శ్రీమతి ద్రౌపది ముర్ము విజయం సాధించినందుకు నేను నా తోటి పౌరులతో కలిసి అభినందనలు తెలియజేస్తున్నాను. రిపబ్లిక్‌కు 15వ అధ్యక్షురాలిగా ఆమె రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఎలాంటి భయం, అనుకూలత లేకుండా పనిచేయాలని భారతదేశం భావిస్తోంది” అని యశ్వంత్ తెలిపారు.

వీరితో పాటు ఇంకా పలువురు ప్రముఖులు.. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.

దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము జీకి అనేక అభినందనలు మరియు శుభాకాంక్షలు అని ఢిల్లీ సీఎం పేర్కొన్నారు. ఎన్నికకు 2 రోజుల ముందు ముర్ముకి ‘ఆప్’ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

గౌరవనీయులైన రాష్ట్రపతి ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ముని నేను అభినందించాలనుకుంటున్నాను. మన రాజ్యాంగం యొక్క ఆదర్శాలను రక్షించడానికి మరియు మన ప్రజాస్వామ్యానికి సంరక్షకుడిగా ఉండటానికి దేశం మిమ్మల్ని హృదయపూర్వకంగా చూస్తుంది, ప్రత్యేకించి దేశం అనేక విబేధాలతో బాధపడుతున్న ఈ సందర్భంలో.. అని మమతా వెల్లడించారు.

ద్రౌపది ముర్ము విజయం.. వైఎస్సార్‌సీపీ అనుసరిస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మహిళా, బలహీన వర్గాల సాధికారతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ప్రజా జీవితంలో ముర్ముకు ఉన్న గొప్ప అనుభవం, ఆమె ఎన్నికైన అత్యున్నత పదవిని అలంకరించిందని’ సీఎం జగన్‌ అన్నారు.

మరోవైపు ప్రతిపక్ష నేతలు కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తదితరులు నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును అభినందించారు.

‘భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి అభినందనలు మరియు శుభాకాంక్షలు’ అని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

‘భారత రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు శ్రీమతి ద్రౌపది ముర్ముకి హృదయపూర్వక అభినందనలు. మీరు మీ గౌరవనీయమైన కార్యాలయం యొక్క బాధ్యతలను మరియు బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమవుతున్న మీకు నా శుభాకాంక్షలు. రాష్ట్రపతిగా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని శరద్ పవార్ తెలిపారు.

‘భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక అభినందనలు. ఆమె మన దేశ సేవలో విజయవంతమైన మరియు సంపూర్ణమైన పదవీకాలం గడపాలని కోరుకుంటున్నాను’ అని చంద్రబాబు తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 19 =