అమెరికాలో కూడా టిక్‌టాక్, వీచాట్‌ యాప్‌ లపై నిషేధం

Donald Trump, TikTok, TikTok Ban In US, tiktok ban in usa, tiktok ban in usa latest news, tiktok ban in usa update, Trump Admin to Ban TikTok, US Ban Tik Tok, US Ban WeChat for National Security, US Decides to Ban Use of TikTok, US President, us president announced to ban tiktok, US President Donald Trump

భారత్‌-చైనా వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌ సహా పలు చైనా ఆధారిత యాప్‌లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా టిక్‌టాక్, వీచాట్‌ యాప్‌ ల‌ విషయంలో అమెరికా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్ ‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని, దేశంలో ఇకపై ఎవరూ ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసే వీలుండదని పేర్కొన్నారు. ఈ‌ యాప్స్ నిషేధంపై అమెరికా వాణిజ్య విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

గతంలోనే టిక్‌టాక్‌, దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ మరియు వీ చాట్ కంపెనీ టెన్సన్ట్ తో సంబంధాలపై 45 రోజుల్లోగా నిషేధం అమల్లోకి రావాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు. టిక్‌టాక్‌ మరియు వీ చాట్ కొనుగోలుపై అమెరికన్‌ కంపెనీలు చట్ట పరిధిలో 45 రోజుల లోపలే చర్చలు జరపాలని, ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరపడమైనా నిషిద్ధమని ఉత్తర్వుల్లో వెల్లడించారు. తాజాగా టిక్‌టాక్, వీచాట్‌ యాప్‌ లపై నిషేధానికే అమెరికా మొగ్గు చూపింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 10 =