అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో నిలిపివేసిన ఆయన ఖాతాను తిరిగి పునరుద్ధరించింది. ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు తర్వాత ట్రంప్‌ను ట్విట్టర్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం ట్రంప్ ఖాతాను తిరిగి పునరుద్దరించాలా? వద్దా? అని ప్రశ్నిస్తూ ట్విట్టర్ పోల్‌ను నిర్వహించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆన్లైన్ పోల్‌లో అధికశాతం మంది ట్రంప్ ఖాతా పునరుద్దరించాలంటూ ఓట్ వేసిన తరుణంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పోల్‌లో పాల్గొన్నవారిలో దాదాపు 60 శాతం మంది యూజర్లు అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్విట్టర్లోకి రావాలని కోరుకున్నారు. ఇక ట్విట్టర్ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తరపున తన గళాన్ని వినిపించడంలో తాను ఎప్పుడూ వెనుకాడనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE