నేటి నుంచే ఫిఫా వరల్డ్‌కప్-2022 ప్రారంభం, పూర్తి షెడ్యూల్ ఇదే.. విజేతకు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లు అంటే?

FIFA World Cup 2022 Starts From Today Group-A First Match Between Qatar and Ecuador,FIFA World Cup 2022 , Group-A First Match,Qatar vs Ecuador,Mango News, Mango News Telugu,FIFA World Cup Complete Schedule,FIFA World Cup Prize Money,FIFA Prize Money 42Million USD,FIFA World Cup 2022 Prize Money,FIFA World Cup,FIFA World Cup Latest News and Updates,World Cup Prize Money 2022,22nd FIFA World Cup 2022,FIFA

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాకర్ (ఫుట్‌బాల్‌) అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని వారందరూ ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్‌ కప్‌’కు సమయం రానే వచ్చింది. ఆదివారం నుంచి ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్‌ కప్‌ ఆరంభమవనుంది. కాగా అరబ్ దేశాలలో ఫిఫా వరల్డ్ కప్ జరుగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఫిఫా వరల్డ్ కప్ చివరి ఎడిషన్ 2018లో రష్యాలో జరిగింది. 2026లో నిర్వహించనున్న ఫిఫా ప్రపంచకప్‌ను అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే వరల్డ్‌కప్‌ స్టేడియాల్లోకి బీర్లకు నో ఎంట్రీ అని ఆతిథ్యమిస్తున్న ఖతార్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు.

ఇక ఈ మెగా టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్‌లో భాగంగా, 32 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఎనిమిది జట్లు ఉంటాయి. మొత్తం 64 మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌ ఈరోజు ఆతిథ్య ఖతార్‌, ఈక్వెడార్‌ మధ్య జరగనుండగా.. ఫైనల్‌ మ్యాచ్‌ డిసెంబర్‌ 18న జరుగుతుంది. ఇక వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌కు గోల్డెన్‌ బూట్‌ అవార్డును ప్రదానం చేస్తారు. బంగారం పూతతో తయారు చేసిన బూటును ప్లేయర్స్‌కు ప్రజెంట్ చేస్తారు. జీవితంలో ఒక్కసారైనా దీనిని అందుకోవాలని ప్రతి ఒక్క సాకర్ ఆటగాడు కలలు కంటాడంటే ఇది ఎంత ప్రత్యేకమైనదో అర్ధం చేసుకోవచ్చు.

భారత అభిమానులు భారత కాలమానం ప్రకారం అన్ని గ్రూప్ దశ మ్యాచ్‌లను మధ్యాహ్నం 3:30, సాయంత్రం 6:30, రాత్రి 8:30, రాత్రి 9:30 మరియు 12:30 గంటలకు ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. ఇక ఇండియాకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క వయాకామ్18 మీడియా ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రసార హక్కులను గెలుచుకుంది. దీంతో భారత అభిమానులు తమ టీవీలలో స్పోర్ట్స్ 18 ఛానెల్‌ని ట్యూన్ చేయడం ద్వారా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. అలాగే ‘జియో సినిమా’ యాప్ ద్వారా కూడా టోర్నమెంట్‌ ఆసాంతం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇక ఫైనల్ వేడుకకు భారత్ తరఫున బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హాజరవనున్నాడు.

విజేతలకు అందజేయనున్న ప్రైజ్ మనీ

కాగా ఫిఫా వరల్డ్‌కప్‌ కోసం ఖతార్‌ నిర్వహణ ఖర్చు 200 బిలియన్‌ అమెరికన్ డాలర్లు. అలాగే ఫిఫా ప్రపంచ కప్ లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన విజేతలకు భారీ ప్రైజ్ మనీ అందనుంది. ప్రపంచ కప్ విజేతకు $42 మిలియన్ (రూ.344 కోట్లు) ప్రైజ్ మనీని అందజేయనుండగా, రన్నరప్‌ జట్టుకు $30 మిలియన్ (రూ.245 కోట్లు) అందజేయనున్నారు. అదే సమయంలో మూడు స్థానంలో ఉన్న జట్టు $27 మిలియన్లు (రూ.220 కోట్లు) మరియు నాల్గవ స్థానంలో ఉన్న జట్టు $25 మిలియన్లు (రూ.204 కోట్లు) దక్కించుకోనున్నాయి.

ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 పూర్తి షెడ్యూల్‌..

 • గ్రూప్‌ స్టేజ్‌: నవంబర్‌ 20-డిసెంబర్ 2
 • రౌండ్‌ ఆఫ్‌ 16: డిసెంబర్‌ 3-6
 • క్వార్టర్‌ఫైనల్స్‌: డిసెంబర్‌ 9-10
 • సెమీఫైనల్స్‌: డిసెంబర్‌ 13-14
 • మూడోస్థానం మ్యాచ్‌: డిసెంబర్‌ 17
 • ఫైనల్‌: డిసెంబర్ 18

భారత కాలమానం ప్రకారం అన్ని మ్యాచ్‌లు..

 • నవంబర్‌ 20 ఖతార్‌ vs ఈక్వెడార్‌ రాత్రి 9.30 గంటలకు
 • నవంబర్‌ 21 ఇంగ్లండ్‌ vs ఇరాన్‌ సాయంత్రం 6.30
 • నవంబర్‌ 21 సెనెగల్‌ vs నెదర్లాండ్స్‌ రాత్రి 9.30
 • నవంబర్‌ 22 యూఎస్‌ఏ vs వేల్స్‌ అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 22 అర్జెంటీనా vs సౌదీ అరేబియా మధ్యాహ్నం 3.30
 • నవంబర్‌ 22 డెన్మార్క్‌ vs టునీషియా సాయంత్రం 6.30
 • నవంబర్‌ 22 మెక్సికో vs పొలాండ్‌ రాత్రి 9.30
 • నవంబర్‌ 23 ఫ్రాన్స్‌ vs ఆస్ట్రేలియా అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 23 మొరాకో vs క్రొయేషియా మధ్యాహ్నం 3.30
 • నవంబర్‌ 23 జర్మనీ vs జపాన్‌ సాయంత్రం 6.30
 • నవంబర్‌ 23 స్పెయిన్‌ vs కోస్టారికా రాత్రి 9.30
 • నవంబర్‌ 24 బెల్జియం vs కెనడా అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 24 స్విట్జర్లాండ్‌ vs కామెరూన్‌ మధ్యాహ్నం 3.30
 • నవంబర్‌ 24 ఉరుగ్వే vs సౌత్‌ కొరియా సాయంత్రం 6.30
 • నవంబర్‌ 24 పోర్చుగల్ vs ఘనా రాత్రి 9.30
 • నవంబర్‌ 25 బ్రెజిల్‌ vs సెర్బియా అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 25 వేల్స్‌ vs ఇరాన్‌ మధ్యాహ్నం 3.30
 • నవంబర్‌ 25 ఖతార్‌ vs సెనెగల్‌ సాయంత్రం 6.30
 • నవంబర్‌ 25 నెదర్లాండ్స్‌ vs ఈక్వెడార్‌ రాత్రి 9.30
 • నవంబర్‌ 26 ఇంగ్లండ్‌ vs యూఎస్‌ఏ అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 26 టునీషియా vs ఆస్ట్రేలియా మధ్యాహ్నం 3.30
 • నవంబర్‌ 26 పొలాండ్‌ vs సౌదీ అరేబియా సాయంత్రం 6.30
 • నవంబర్‌ 26 ఫ్రాన్స్‌ vs డెన్మార్క్‌ రాత్రి 9.30
 • నవంబర్‌ 27 అర్జెంటీనా vs మెక్సికో అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 27 జపాన్‌ vs కోస్టారికా మధ్యాహ్నం 3.30
 • నవంబర్‌ 27 బెల్జియం vs మొరాకో సాయంత్రం 6.30
 • నవంబర్‌ 27 క్రొయేషియా vs కెనడా రాత్రి 9.30
 • నవంబర్‌ 28 స్పెయిన్‌ vs జర్మనీ అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 28 కామెరూన్‌ vs సెర్బియా మధ్యాహ్నం 3.30
 • నవంబర్‌ 28 సౌత్‌ కొరియా vs ఘనా సాయంత్రం 6.30
 • నవంబర్‌ 28 బ్రెజిల్‌ vs స్విట్జర్లాండ్‌ సాయంత్రం 6.30
 • నవంబర్‌ 29 పోర్చుగల్‌ vs ఉరుగ్వే అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 29 ఈక్వెడార్‌ vs సెనెగల్‌ రాత్రి 8.30
 • నవంబర్‌ 29 నెదర్లాండ్స్‌ vs ఖతార్‌ రాత్రి 8.30
 • నవంబర్‌ 30 ఇరాన్‌ vs యూఎస్‌ఏ అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 30 వేల్స్‌ vs ఇంగ్లండ్‌ అర్ధరాత్రి 12.30
 • నవంబర్‌ 30 ఆస్ట్రేలియా vs డెన్మార్క్‌ రాత్రి 8.30
 • నవంబర్‌ 30 టునీషియా vs ఫ్రాన్స్‌ రాత్రి 8.30
 • డిసెంబర్‌ 1 పోలాండ్‌ vs అర్జెంటీనా అర్ధరాత్రి 12:30
 • డిసెంబర్‌ 1 సౌదీ అరేబియా vs మెక్సికో అర్ధరాత్రి 12:30
 • డిసెంబర్‌ 1 కెనడా vs మొరాకో రాత్రి 8:30
 • డిసెంబర్‌ 1 క్రొయేషియా vs బెల్జియం రాత్రి 8:30
 • డిసెంబర్‌ 2 కోస్టారికా vs జర్మనీ అర్ధరాత్రి 12:30
 • డిసెంబర్‌ 2 జపాన్‌ vs స్పెయిన్‌ అర్ధరాత్రి 12:30
 • డిసెంబర్‌ 2 ఘనా vs ఉరుగ్వే రాత్రి 8:30
 • డిసెంబర్‌ 2 సౌత్ కొరియా vs పోర్చుగల్‌ రాత్రి 8:30
 • డిసెంబర్‌ 3 కామెరూన్‌ vs బ్రెజిల్‌ అర్ధరాత్రి 12:30
 • డిసెంబర్‌ 3 సెర్బియా vs స్విట్జర్లాండ్‌ అర్ధరాత్రి 12:30

రౌండ్‌ ఆఫ్‌ 16

 • డిసెంబర్‌ 3 1ఎ vs 2బి రాత్రి 8:30
 • డిసెంబర్‌ 4 1సీ vs 2డీ అర్ధరాత్రి 12.30
 • డిసెంబర్‌ 4 1డీ vs 2సీ రాత్రి 8.30
 • డిసెంబర్‌ 5 1బీ vs 2ఎ అర్ధరాత్రి 12.30
 • డిసెంబర్‌ 5 1ఈ vs 2ఎఫ్‌ రాత్రి 8.30
 • డిసెంబర్‌ 6 1జీ vs 2హెచ్‌ అర్ధరాత్రి 12.30
 • డిసెంబర్‌ 6 1ఎఫ్‌ vs 2ఈ రాత్రి 8.30
 • డిసెంబర్‌ 7 1హెచ్‌ vs 2జీ అర్ధరాత్రి 12.30

క్వార్టర్‌ ఫైనల్‌

 • డిసెంబర్‌ 9 తొలి క్వార్టర్‌ఫైనల్‌ రాత్రి 8.30 గంటలకు
 • డిసెంబర్‌ 10 రెండో క్వార్టర్‌ఫైనల్‌ అర్ధరాత్రి 12.30
 • డిసెంబర్‌ 10 మూడో క్వార్టర్‌ఫైనల్‌ రాత్రి 8.30
 • డిసెంబర్‌ 11 నాలుగో క్వార్టర్‌ఫైనల్‌ అర్ధరాత్రి 12.30

సెమీ ఫైనల్స్‌

 • డిసెంబర్‌ 14 తొలి సెమీఫైనల్‌ అర్ధరాత్రి 12.30 గంటలకు
 • డిసెంబర్‌ 15 రెండో సెమీఫైనల్‌ అర్ధరాత్రి 12.30

మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌

 • డిసెంబర్‌ 17 సెమీఫైనల్స్‌లో ఓడిన టీమ్స్‌ మధ్య రాత్రి 8.30 గంటలకు

ఫైనల్స్‌

 • డిసెంబర్‌ 18 సెమీఫైనల్స్‌ విజేతల మధ్య రాత్రి 8.30 గంటలకు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + five =