అమెరికాను వణికిస్తున్న మంకీపాక్స్‌.. హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించిన బైడెన్ ప్ర‌భుత్వం

US Govt Declares Public Health Emergency Amid Rising Monkeypox Outbreak in The Country, US Public Health Emergency Amid Rising Monkeypox Outbreak in The Country, Rising Monkeypox Outbreak in US Country, Public Health Emergency, Rising Monkeypox Outbreak in US, USA declares monkeypox outbreak, Joe Biden declares monkeypox in US a public health emergency, US declares public health emergency, monkeypox has been designated a public health emergency in US, US monkeypox outbreak, US monkeypox outbreak News, US monkeypox outbreak Latest News, US monkeypox outbreak Latest Updates, US monkeypox outbreak Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌ ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. రోజు రోజుకూ అక్కడ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. అమెరికాలో దాదాపు 6600 కేసులు న‌మోదు అవగా, అందులో మూడ‌వ వంతు కేసులు ఒక్క న్యూయార్క్‌లోనే బ‌య‌ట‌ప‌డ్డాయి. మరోవైపు కాలిఫోర్నియా, ఇలియాస్‌ రాష్ట్రాల్లోనూ కేసులు ఎక్కువగా న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అప్రమత్తమైన బైడెన్ సర్కార్ అక్క‌డ ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా 26వేలకు పైగా మంకీపాక్స్‌ కేసులు న‌మోదు అయిన‌ట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ ప్రకటించింది. కాగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవలే హెల్త్ ఎమ‌ర్జెన్సీ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

ఇక మంకీపాక్స్ నియంత్రణకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసిన అధ్యక్షుడు జో బైడెన్, దేశంలో పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు టీకా పంపిణీని వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ వైరస్‌ వల్ల ఎదురయ్యే ముప్పును ప్రజలకు తెలియజేస్తామని, అందుకే మంకీపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించామని ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలిపారు. ఇల్లినాయిస్ మరియు న్యూ యార్క్‌ రాష్ట్రాలు స్వీయ అత్యవసర పరిస్థితులను ప్రకటించుకున్న తరువాత, అప్రమత్తమైన బైడెన్ మంకీపాక్స్‌పై దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడానికి ఆగస్టు 2న ఇద్దరు అగ్ర సమాఖ్య అధికారులను నియమించారు. వీరు ఇచ్చిన నివేదికల ఆధారంగా తుది నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − sixteen =