ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్ధతు, సీఎం కేసీఆర్ నిర్ణయం

Vice Presidential Election-2022 CM KCR Announced TRS Party Support to Opposition Candidate Margaret Alva, CM KCR Announced TRS Party Support to Opposition Candidate Margaret Alva, Telangana CM KCR Announced TRS Party Support to Opposition Candidate Margaret Alva, KCR Announced TRS Party Support to Opposition Candidate Margaret Alva, Telangana Rashtra Samithi Support to Opposition Candidate Margaret Alva, TRS Party Support to Opposition Candidate Margaret Alva, Opposition Candidate Margaret Alva, TRS Party Support Margaret Alva, Vice Presidential Election-2022, 2022 Vice Presidential Election, Vice Presidential Election, Vice-President poll, Telangana Rashtra Samithi, Margaret Alva News, Margaret Alva Latest News, Margaret Alva Latest Updates, Margaret Alva Live Updates, Mango News, Mango News Telugu

దేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు రేపు (ఆగస్టు 6, శనివారం) ఓటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరపున జగదీప్ ధన్కర్, కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్)పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఉప రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతునివ్వాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 16 మంది ఎంపీలు (లోక్ సభ, రాజ్య సభ) మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ జరగనుండగా, అదేరోజున కౌంటింగ్ కూడా చేపట్టనున్నారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియనుంది. దీంతో ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here