హెచ్​-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం.. వేలాది మంది భారతీయ టెక్కీలకు భారీ ఉపశమనం

US Plans To Resume Domestic Visa Revalidation on Pilot Basis Will Benefit For Thousands of H-1B Visa Holders Indian Techies,H1B Visa,H 1B Visa Status,H1B Visa Requirements,H1B Salary,H1B Visa Full Form,H1B Visa To Green Card,Mango News,Mango News Telugu,H1B Visa For Indian,H1 Visa Types,H-1B Visa Status,H1B Visa Holders,H1B Visa Holders Are Resident Aliens,H1B Visa Holders Stuck In India,H1B Visa Holders Can Travel To Us,H1B Visa Holders Travel Ban,H1B Visa Holders Rights In Us,H1B Visa Holders Applying For Green Card,H1B Visa Holders Are Resident Aliens For Tax Purposes,H1B Visa Holders Travel To India,H1B Visa Holders Returning To India,Work Permit For H-1B Visa Holders Spouses,Minimum Salary Of H-1B Visa Holders,Family Of H-1B Visa Holders,H1B Visa Holders In Usa,H1B Visa Holders Layoffs,H1B And L1B Visa Holders,H1B Visa Holders Moving To Canada,H1B Visa Holders Laid Off

అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకోనుంది. హెచ్​-1బీ వీసాలకు సంబంధించి బైడెన్ సర్కార్ హెచ్​-1బీ మరియు ఎల్-1 వీసాలపై ఉన్న పదివేల మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో భాగంగా ‘డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్’ను పైలట్ ప్రాతిపదికన తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది. దీంతో వేలాది మంది హెచ్​-1బీ వీసా హోల్డర్స్ అయిన భారతీయ టెక్కీలకు ప్రయోజనం చేకూరుతుంది. కాగా అమెరికాలోని కంపెనీలు.. విదేశీయులకు ఉద్యోగాలివ్వాలంటే అక్కడి ప్రభుత్వం ఈ హెచ్​-1బీ వీసాను ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా ఆర్ధిక వ్యవస్థలో గణనీయ ప్రభావం చూపించే హెచ్​-1బీ వీసాదారులు ఆ దేశానికి చాలా కీలకం. ఎన్నో దశాబ్దాలుగా లక్షలాది మంది భారతీయులు, చైనీయులు.. ఈ హెచ్​-1బీ వీసా పొందే అమెరికాలో ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో ప్రారంభించబోయే ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తిగా అమలులోకి వస్తే యునైటెడ్ స్టేట్స్‌లోని వేలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులకు భారీ ఉపశమనం లభించనుంది.

కాగా 2004 వరకు హెచ్​-1బీ వంటి కొన్ని కేటగిరీల్లోని నాన్​ ఇమ్మిగ్రెంట్​ వీసాలను అమెరికా దేశంలోనే రెన్యూవల్ స్టాంప్​ చేయించుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఆ తర్వాత విదేశీ విధానంలో చేసిన కొన్ని మార్పుల కారణంగా ఆ వీసాలను రెన్యూవల్ చేయించుకోవడానికి సంబంధిత వీసాదారులు దేశం నుంచి బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సొంత దేశాలకు వెళ్లి, అక్కడ పాస్​పోర్టుల మీద ఎక్స్​టెన్షన్​ స్టాంప్​ వేయించుకుని తిరిగి రావాల్సి వస్తోంది. కానీ అక్కడ స్టాంపింగ్​ ప్రక్రియ పూర్తవడానికి ఒక్కోసారి నెలల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ, ఎదో ఒక కారణం వలన చాలా జాప్యం జరుగుతుంది. దీంతో ఆయా వ్యక్తులు తమ ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రెసిడెన్షియల్​ కమిషన్​.. వీసా రీవాలిడేషన్​ ప్రక్రియను ప్రారంభించాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలను అభ్యర్థిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే బైడెన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ఇలాంటి వారందరికీ ఎంతో ఉపశమనం కలుగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =