ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగం విజయవంతం, ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

AP CM YS Jagan Congratulates ISRO Team for The Successful Launch of SSLV-D2,AP CM YS Jagan Congratulates ISRO,Orbit From Sriharikota Today,Isro Sslv Launch Date,Sslv D1,Sslv Upsc,Sslv Stages,Mango News,Mango News Telugu,Sslv Isro Failure,Sslv Wikipedia,Small Satellite Launch Vehicle,Sslv-D1,Isro Sslv Launch,Isro Sslv D1,Isro Sslv Failure,Isro Sslv D1 Launch,Isro Sslv Upsc,Isro Sslv Wiki,Isro Sslv Test,Isro Sslv Launch Registration,Isro New Rocket Sslv,ISRO Team SSLV-D2

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2) ను ప్రయోగించింది. ప్రయోగించిన కొద్దిసేపటికే ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్ మూడు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2/ఈఓఎస్-07 మిషన్ విజయవంతంగా చేయబడిందని, ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్ ఈఓఎస్-07, జానూస్-1 మరియు అజాదిశాట్‌-2లను వాటి నిర్దేశించిన కక్ష్యల్లోకి చేర్చిందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.

ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగం విజయవంతం నేపథ్యంలో ఇస్రో బృందానికి/శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ మేరకు ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది. “ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 ని విజయవంతంగా ప్రయోగించినందుకు, దేశం యొక్క అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లినందుకు ఇస్రో బృందానికి సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధించబడిన ఇస్రో బృందం మరియు యువకులు వారి భవిష్యత్ ప్రయత్నాలలో మరింత విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =