అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంప‌తుల‌కు క‌రోనా పాజిటివ్‌

Coronavirus live news, Donald Trump, Donald Trump and his Wife Melania Test Positive, Donald Trump Test Positive, Hope Hicks, Melania to quarantine, President of the United States of America, President Trump and first lady test positive, Trump Quarantines, US President, US President Donald Trump In Self Isolation

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా బారిన పడ్డారు. ట్రంప్ తో పాటుగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు. “మెలనియా ట్రంప్ కు, నాకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. క్వారంటైన్ ప్రక్రియ, రికవరీ పక్రియను వెంటనే ప్రారంభించాము. వైర‌స్ బారి నుంచి త్వరలోనే బయటపడతాము” అని ట్రంప్ ట్వీట్ చేశారు.

ముందుగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స‌ల‌హాదారు హోప్ హిక్స్‌కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని, క్వారంటైన్ పక్రియ మొదలుపెట్టామని ట్రంప్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ క్రమంలో వారికీ కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్టు ప్రకటించారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రూ ఆరోగ్యంగానే ఉన్నార‌ని, వైట్‌హౌజ్‌లోనే క్వారంటైన్ లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 4 =