ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా డబ్ల్యూహెచ్ఓకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ అధికారుల్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డబ్ల్యూహెచ్ఓ తో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్టు మే 29, శుక్రవారం నాడు ప్రకటించారు. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ పై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.
కరోనా వ్యాప్తి విషయంలో చైనాతో కలిసి డబ్ల్యూహెచ్ఓ కూడా నిర్లక్ష్యం ప్రదర్శించి, ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రాణ, ఆర్ధిక నష్టాలకు కారణమైందని విమర్శించారు. చైనా కోరిక మేరకే కరోనా వైరస్ గురించి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. కరోనా విషయంలో సమర్ధంగా వ్యవహరించని డబ్ల్యూహెచ్ఓ సంస్థను అందుకు బాధ్యత వహించేలా చేయాలని అన్నారు. కేవలం 40 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించే చైనా చెప్పినట్లు డబ్ల్యూహెచ్ఓ వింటుందని, దాదాపు అమెరికా 400 మిలియన్ల డాలర్లు వార్షిక సాయం అందిస్తున్న జవాబుదారీతనంగా ఉండడంలేదన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిధులను ప్రపంచంలోని ఇతర ఆరోగ్య సంస్థలకు మళ్ళించనున్నామని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu