టీ20 ప్రపంచకప్-2022 కోసం ఎంపికైన వెస్టిండీస్ జట్టు ఇదే…

West Indies Announced 15 member Squad for the ICC Mens T20 World Cup 2022, ICC Men's T20 World Cup, T20 World Cup 2022, West Indies T20 World Cup Team, T20 World Cup West Indies Team, Mango News , Mango News Telugu, West Indies 15 member Squad, Nicholas Pooran , Rovman Powell (VC), Yannic Cariah, Johnson Charles, Sheldon Cottrell, Shimron Heymyer, Jason Holder, Akeal Hosein, Alzarri Joseph, Brandon King, Evin Lewis, Kyle Mayers, Obed McCoy, Raymon Reifer, Odean Smith

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్-2022 కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వెస్టిండీస్ టీ20 జట్టుకు నికోలస్ పురన్ కెప్టెన్ గా, రోవ్‌మన్ పావెల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ కు, ఆరేళ్లుగా టీ20లు ఆడని జాన్సన్ చార్లెస్‌ లకు జట్టులో చోటు దక్కింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ అయిన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ ఆల్‌రౌండర్ యాన్నిక్ కరియా మరియు లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ రేమన్ రీఫర్ జట్టుకు ఎంపిక చేయబడ్డారు. ఇక ఆల్‌రౌండర్లు ఆండ్రీ రస్సెల్, ఫాబియన్ అలెన్‌లకు, స్పిన్నర్ సునీల్ నరైన్‌ లకు జట్టులో చోటు దక్కలేదు. అయితే జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్ వంటి ఆల్‌రౌండర్లతో వెస్టిండీస్ జట్టు బలంగానే ఉంది.

మరోవైపు ఎనిమిదో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు జరుగనుంది. కాగా 2012లో శ్రీలంకలో, 2016లో భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టు వెస్టిండీస్ గా నిలిచింది. టీ20 ఫార్మాట్ లో బీకరజట్టుగా వెస్టిండీస్‌ కు పేరుంది. ఈ ఫార్మాట్లో వెస్టిండీస్ మరోసారి ఎలాంటి సంచలనాలు నమోదు చేయబోతుందో వేచిచూడాలి.

టీ20 ప్రపంచకప్‌-2022 కోసం ఎంపికైన వెస్టిండీస్ జట్టు:

  1. నికోలస్ పూరన్ (కెప్టెన్),
  2. రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్),
  3. యానిక్ కారియా
  4. జాన్సన్ చార్లెస్
  5. షెల్డన్ కాట్రెల్
  6. షిమ్రాన్ హెట్మేర్
  7. జాసన్ హోల్డర్
  8. అకేల్ హోసేన్
  9. అల్జారీ జోసెఫ్
  10. బ్రాండన్ కింగ్
  11. ఎవిన్ లూయిస్
  12. కైల్ మేయర్స్
  13. ఒబెడ్ మెక్‌కాయ్
  14. రేమాన్ రీఫర్
  15. ఓడియన్ స్మిత్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =