5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ సమావేశంలో నిర్ణయం

AP Assembly Session to be Held for 5 Days Decided in BAC Meeting, AP Assembly Session to be Held for 5 Days, AP Assembly BAC Meeting, Andhra Pradesh Legislative Assembly, Winter Session,AP Assembly Mansoon Session, Mango News, Mango News Telugu, AP Assembly Sessions, Monsoon session of Andhra Pradesh Legislature, AP Assembly Calendar , Monsoon Session of AP Legislature, Andhra Pradesh Legislative Assembly Sep15th, Monsoon Session, AP Assembly Session Latest News And Updates, YSR Congerss Paty, TDP Party, BJP Party, Janasena Party

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15, గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, శత్రుచర్ల చంద్రశేఖర రాజు, జేఆర్ పుష్పరాజ్, పులపర్తి నారాయణమూర్తి, నల్లమిల్లి మూలారెడ్డిలకు సభ సంతాపం తెలిపింది. ఆతర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన అసెంబ్లీ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం జరుగనుంది.

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ సభాపక్షనేత అచ్చెంనాయడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ అసెంబ్లీ సమావేశాలు 5 రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సెలవు దినాలు కలుపుకొని సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 21 వరకు సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15, 16, 19, 20, 21 తేదీల్లో సమావేశాలు జరగనుండగా, సెప్టెంబర్ 17 శనివారం, సెప్టెంబర్ 18 ఆదివారంను అసెంబ్లీకి సెలవు దినాలుగా నిర్ణయించారు. ఇక టీడీపీ ప్రతిపాదించిన పలు అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 15 =