మహిళల టీ20 ప్రపంచ కప్‌: 6వ సారి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో దక్షిణాఫ్రికా ఘనవిజయం

Womens T20 World Cup 2023 Australia Beat South Africa in Final To Win Record Extending 6th Title, Womens T20 World Cup 2023, Australia Beat South Africa, Womens T20 World Cup Final, Australia Win Record Extending 6th Title,Womens T20 Australia Beat South Africa, Mango News, Mango News Telugu,Womens T20 World Cup 2023 Schedule,Icc Women'S T20 World Cup 2023,Icc Women'S T20 World Cup 2023 Fixtures,Icc Women'S T20 World Cup 2023 Schedule,Icc Women'S T20 World Cup 2023 Teams,Icc Women'S World Cup 2023 Points Table,Icc Womens T20 World Cup 2023 Qualifier,Icc Womens World Cup 2023 Live Score,Icc Womens World Cup 2023 Points Table,Icc World Cup T20 2023 Women'S Live,Icc World Cup T20 2023 Women'S Live Score,Women'S Cricket T20 World Cup 2023 Schedule,Women'S T20 World Cup 2021 Schedule

మహిళల క్రికెట్‌లో తమది అత్యుత్తమ జట్టు అని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా జట్టు రికార్డు స్థాయిలో మహిళల టీ20 ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. 2018, 2020లోనూ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. వరుసగా మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ గెలుచుకుని హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. తద్వారా మొత్తం మీద ఆరోసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక గతంలో ఆస్ట్రేలియా 2010, 2012, 2014లలో కూడా ఈ మెగా ట్రోఫీని గెలుచుకుంది. సెమీఫైనల్లో టీమిండియాపై నెగ్గిన ఆసీస్, ఆదివారం జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఆతిథ్య ప్రొటీస్ జట్టును చిత్తు చేసింది. ఇక ఆసీస్ విధించిన 157 పరుగుల లక్ష్యఛేదనలో వాల్‌వార్ట్‌ మినహా మిగతా ప్లేయర్స్ విఫలమవడంతో దక్షిణాఫ్రికా చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

కాగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆ జట్టులో స్టార్ బ్యాట్స్ వుమన్ బెత్‌ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్‌; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకం సాధించింది. ఇంకా గార్డ్‌నర్‌ (29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అలీసా హీలీ (18; 3 ఫోర్లు) జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నమ్‌ ఇస్మాయిల్‌, మరిజన్నే ఖాప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టాగా.. మ్లాబా, ట్రయాన్‌ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ప్రొటీస్ జట్టు, 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మేగన్‌ స్కట్‌, గార్డ్‌నర్‌, డార్సీ బ్రౌన్‌, జొనాసెన్‌లు తలో వికెట్ పడగొట్టారు. ఓపెనర్ లారా వాల్‌వార్ట్‌ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజులో ఉన్నంత వరకు మ్యాచ్‌ను గెలుచుకునేలా కనిపించిన ప్రోటీస్.. ఆ తర్వాత 17వ ఓవర్‌లో ఆమె అవుట్ కావడంతో లక్ష్యం అందుకోలేకపోయింది. దీంతో తొలిసారి మెగాటోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా చివరకు నిరాశ తప్పలేదు. ఇక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ బెత్‌ మూనీ దక్కించుకోగా.. గార్డ్‌నర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా: అలీసా హీలీ (సి) డి క్లెర్క్‌ (బి) కాప్‌ 18, బెత్‌ మూనీ (నాటౌట్‌) 74, ఆష్లే గార్డ్‌నర్‌ (సి) లూస్‌ (బి) ట్రయాన్‌ 29, గ్రేస్‌ హ్యారిస్‌ (బి) లాబా 10, మెగ్‌ లానింగ్‌ (సి) ట్రయాన్‌ (బి) కాప్‌ 10, ఎలిస్‌ పెర్రీ (సి) బ్రిట్స్‌ (బి) ఇస్మాయిల్‌ 7, జార్జియా (బి) ఇస్మాయిల్‌ 0, తాహ్లియా మెక్‌గ్రాత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 156/6.

బౌలింగ్‌: నాన్‌కులులెకో మ్లాబా 3-0-24-1, షబ్నమ్‌ ఇస్మాయిల్‌ 4-1-26-2, మరిజన్నే ఖాప్‌ 4-0-35-2, ఖాక 4-0-27-0, నాదినె డి క్లెర్క్‌ 3-0-27-0, చ్లో ట్రయాన్‌ 2-0-15-1.

దక్షిణాఫ్రికా: లారా ఉల్వర్డ్‌ (ఎల్బీ) షట్‌ 61, బ్రిట్స్‌ (సి) మెక్‌గ్రాత్‌ (బి) బ్రౌన్‌ 10, మరిజన్నే ఖాప్‌ (సి) బ్రౌన్‌ (బి) గార్డ్‌నర్‌ 11, సునె లుస్‌ (రనౌట్‌) 2, చ్లో ట్రయాన్‌ (బి) జొనాసెన్‌ 25, నాదినె డి క్లెర్క్‌ (నాటౌట్‌) 8, అన్నెకె బాష్‌ (రనౌట్‌) 1, సినాలో జాఫ్తా (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 137/6.

బౌలింగ్‌: మేగన్‌ స్కట్‌ 4-0-23-1, గార్డ్‌నర్‌ 4-0-20-1, డార్సీ బ్రౌన్‌ 4-0-25-1, ఎలిస్‌ పెర్రీ 1-0-5-0, జొనాసెన్‌ 3-0-21-1, జార్జియా 2-0-21-0, తాహ్లియా మెక్‌గ్రాత్‌ 2-0-17-0.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =