బిగ్ బాస్ తెలుగు సీజన్ 5‌ టైటిల్ విజేత సన్నీ.. రెండవ స్థానంలో షణ్ముఖ్

#BBTeluguGrandFinale, #BiggBossTelugu, #BiggBossTelugu5, #VJSunny, Akkineni Nagarjuna, BB Telugu Grand Finale, Big Boss 5, Bigg Boss, Bigg Boss 5, bigg boss 5 telugu, Bigg Boss 5 Telugu Finale, Bigg Boss 5 Telugu Finale Highlights, Bigg Boss 5 Telugu Title Winner VJ Sunny, Bigg Boss 5 Telugu VJ Sunny, Bigg Boss 5 Telugu Winner, Bigg Boss House, Bigg Boss Season 5, Bigg Boss Season 5 Telugu, Bigg Boss Telugu, Bigg Boss Telugu 5, Bigg Boss Telugu 5 Contestant, Bigg Boss Telugu 5 contestants, Bigg Boss Telugu 5 Finale, Bigg Boss Telugu 5 Grand Finale Highlights, Bigg Boss Telugu 5 Title, Bigg Boss Telugu 5 Title Winner VJ Sunny, Bigg Boss Telugu 5 VJ Sunny Wins Show, Bigg Boss Telugu 5 Winner, Bigg Boss Telugu Season 5, Bigg Boss Telugu Season 5 Title Winner VJ Sunny, Bigg Boss VJ Sunny, Boss Telugu 5 Final Contestants, Maanas, Shanmukh, Siri, Sreerama Chandra, VJ Sunny, VJ Sunny Bigg Boss 5 Telugu, VJ Sunny Bigg Boss 5 Telugu Winner, VJ Sunny Bigg Boss Telugu Season 5, VJ Sunny Latest News, VJ Sunny Wins Bigg Boss 5 Telugu Title, VJ Sunny Wins Trophy Takes Home Rs 50 Lakhs, Winner Of Bigg Boss Telugu Season 5, Youtuber Shanmukh Becomes Runner up

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రోగ్రాం రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు బిగ్ బాస్ ఇప్పటికి ఐదు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 5న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 106 రోజుల రోలర్ కోస్టర్ జర్నీని ఘనంగా ముగించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేతగా సన్నీ నిలిచాడు. షణ్ముఖ్ ఫస్ట్ రన్నరప్‌గా.. శ్రీరామ చంద్ర సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. బిగ్ బాస్ 5 విజేత సన్నీ ట్రోఫీతో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నాడు.

సన్నీ విజేతగా నిలవటంతో.. సువర్ణభూమి యాజమాన్యం రూ. 25 లక్షల విలువైన ప్లాట్‌ని బహుమతిగా ప్రకటించింది. దీంతోపాటు ఒక టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడు సన్నీ. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సన్నీ.. తర్వాత లైఫ్‌స్టైల్ ఛానెల్‌లో పనిచేసి చివరకు వీజేగా మారాడు. కళ్యాణ వైభోగం సీరియల్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీద, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ, జస్వంత్, అనీ, రవి, ప్రియాంక సింగ్, కాజల్, సన్నీ, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, మానస్.. పోటీదారులుగా తెలుగు బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రారంభమైంది.

నాగార్జున హోస్ట్ చేస్తున్న షో ఆదివారం గ్రాండ్ ఫినాలే కావడంతో సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బిగ్ బాస్ తెలుగు 5 ముగింపులో భాగమైన వారిలో SS రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్, నాని, నాగ చైతన్య, శ్రియా శరణ్ మరియు అయాన్ ముఖర్జీ ఉన్నారు. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేలో టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున బ్లాక్‌ డ్రెస్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున మిర్చీ మూవీలోని బార్బీ గర్ల్ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ అలరించాడు. తర్వాత ఐదో సీజన్‌ 14 మంది ఎక్స్‌ కంటెస్ట్‌లను ఆహ్వానించారు. వారు తమదైన స్టైల్‌తో డ్యాన్స్‌ చేసి అలరిస్తారని చెప్పారు. ఇక వరుసగా ఎక్స్ కంటెస్టెంట్స్‌ డాన్స్‌లు వేశారు. అందులో భాగంగా అనీ, నటరాజ్ మాస్టర్‌లు ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఇరగదీశారు. చివరకు నాగార్జున సన్నీని విజేతగా విజేతగా ప్రకటించటంతో ప్రేక్షకుల ఆనందం మిన్నంటింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nineteen =