ప్రముఖ నటుడు మహేశ్‌బాబుకు మాతృవియోగం, చిరంజీవి సహా పలువురు ప్రముఖుల సంతాపం

Actor Mahesh Babu's Mother Indira Devi Passes Away Chiranjeevi Film Celebrities Expressed their Grief and Paid Tribute to Indira Devi, Actor Mahesh Babu Is Bereaved Of His Mother, Celebrities Including Chiranjeevi Mourned, Tollywood Hero Mahesh Babu, Mahesh Mother Indira Devi Passes Away Today, Mahesh Mother Indira Devi, Indira Devi Passes Away Today, Tollywood Hero Mahesh Babu's Mother Indira Devi, Mango News, Mango News Telugu, Super Star Mahesh Babu, Indira Devi Passed Away, Mahesh Babu Mother Indira Devi, Mahesh Babu Latest News And Updates, Indira Devi, Namrata Shirodkar, Tollywood Latest News And Live Updates

ప్రముఖ నటుడు మహేశ్‌ బాబుకు మాతృవియోగం కలిగింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు తల్లి శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందిరాదేవి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నటి నటులు, ఘట్టమనేని అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

“శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేష్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను” అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, ఘట్టమనేని మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారి మరణం బాధాకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణ కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను – హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ

ప్రముఖ నటులు కృష్ణ గారి సతీమణి, మహేశ్​బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారు తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధ నుంచి కృష్ణ గారు, మహేశ్ బాబు త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను – జనసేన అధినేత, నటుడు పవన్‌ కళ్యాణ్

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + five =