దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లలో 5వ స్థానం దక్కించుకున్న ఆలేరు పోలీస్ స్టేషన్

Alair Police Station Declared as Fifth Best Police Station Among 75 Best Across the Country, Alair police station in Rachakonda commissionerate has been declared the fifth best PS among 75 across in India, Alair Police Station Declared as Fifth Best Police Station In India, Alair Police Station Declared as Fifth Best PS Among 75 Best PS, Alair Ps Ranked 5th Out Of 75 Best Across the Country, Telangana's Alair police station ranked fifth out of 75 Best Across the Country, Alair PS adjudged best in Telangana, Alair police station was adjudged as the best police station in Telangana by the Ministry of Home affairs, Ministry of Home affairs, Alair police station was adjudged as the best police station in Telangana, best police station in Telangana, Rachakonda commissionerate, Alair Police Station, Alair Police Station News, Alair Police Station Latest News, Alair Police Station Latest Updates, Alair Police Station Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా టాప్ 75 ఉత్తమ పోలీస్ స్టేషన్‌ల జాబితాలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఆలేరు పోలీస్ స్టేషన్ 5వ ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా నిలిచింది. డేటా విశ్లేషణ, ప్రత్యక్ష పరిశీలన మరియు ప్రజల అభిప్రాయాల ప్రాతిపదికన ప్రతి రాష్ట్రంలో ఉత్తమంగా పనిచేసే పోలీసు స్టేషన్లను ఎంపిక చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ల యొక్క సమర్థవంతమైన పనితీరును ప్రోత్సహించడానికి మరియు వాటిలో ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉత్తమంగా పనిచేసే పోలీసు స్టేషన్లను ఎంపిక చేస్తుంది.

దేశంలోనే టాప్ 75 పోలీస్‌ స్టేషన్లలో ఆలేరు పోలీస్ స్టేషన్ 5వ స్థానం దక్కించుకోవడం పట్ల తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆలేరు స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది అందరికీ డీజీపీ అభినందనలు తెలిపారు. మరోవైపు ఆలేరు పోలీసు స్టేష‌న్‌ 5వ ర్యాంకు దక్కించుకోవడం పట్ల రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్ ఎం.మ‌హేశ్ భ‌గ‌వ‌త్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. శుక్రవారం నాడు కమిషనరేట్ లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆలేరు స్టేషన్ సిబ్బందికి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. అలాగే కేంద్ర హోమ్ శాఖ ఇచ్చిన ఎక్స‌లెన్స్ స‌ర్టిఫికెట్‌ను సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ఆలేరు ఎస్ఐ ఇద్రీస్ అలీకి అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 1 =