హైదరాబాద్: క్యాంపస్‌లో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించిన ఉస్మానియా యూనివర్సిటీ

Hyderabad OU Executive Council Rejects Permission For Rahul Gandhi Public Meeting in Campus, OU Council Rejects Permission For Rahul Gandhi’s Public Meeting In Campus, Osmania University Council rejected permission from Congress seeking Rahul Gandhi's public meeting in the campus, Rahul Gandhi's public meeting in the Osmania University campus, Rahul Gandhi’s Public Meeting In Osmania University, Osmania University rejected Rahul Gandhi's request for a public meeting on the campus, Telangana Pradesh Congress Committee seeking permission for the public meeting, Rahul Gandhi’s visit to the OU, Osmania University, Rahul Gandhi Public Meeting, Rahul Gandhi Public Meeting News, Rahul Gandhi Public Meeting Latest News, Rahul Gandhi Public Meeting Latest Updates, Rahul Gandhi Public Meeting Live Updates, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రాహుల్ గాంధీ బహిరంగ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు తమ క్యాంపస్‌లో రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ ఒక్క సభకే పరిమితం కాదని, భవిష్యత్తులో కూడా ఎవరి సభలకూ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. కాగా కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకంటూ తెలంగాణ కాంగ్రెస్ మే 6వ తేదీన వరంగల్ వేదికగా నిర్వహించనున్న ‘రైతు సంఘర్షణ సభ’లో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు.

ఆ తరువాత రోజు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ వద్ద రాహుల్‌ గాంధీ విద్యార్థులతో ముచ్చటిస్తారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతతో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ఆర్ట్స్ కాలేజీ లేదా ఠాకూర్ ఆడిటోరియంలో స్థలం ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీ సభ సందర్భంగా పార్టీ జెండాలు మోయబోమని కాంగ్రెస్ నేతలు హామీ కూడా ఇచ్చారు. అలాగే ఎలాంటి రాజకీయ జెండాలు, ర్యాలీలు నిర్వహించవద్దని వైస్‌ఛాన్సలర్‌కు హామీ ఇచ్చారు. అయితే టీఆర్‌ఎస్‌వీ నాయకులు మంగళవారం ఓయూ వీసీని కలిసి ప్రతిపాదిత పర్యటనకు అనుమతి ఇవ్వరాదని వినతి పత్రం అందించారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 1 =