రజనీకాంత్‌ ఆరోగ్యంపై మరో హెల్త్‌ బులెటెన్‌ విడుదల, డిశ్చార్జ్ పై రేపు నిర్ణయం

Another Bulletin on Rajinikanth Health,Decision on Discharge will be Taken Tomorrow,Rajinikanth Hospitalised,Rajinikanth,Superstar Rajinikanth Hospitalised,Rajinikanth Hospitalised In Hyderabad,Rajinikanth Hospitalized,Rajinikanth Health,Rajinikanth Health Condition,Rajinikanth In Hospital,Superstar Rajinikanth,Superstar Rajinikanth Hospitalized,Rajinikanth Latest News,Rajinikanth At Hospital,Rajinikanth In Miot Hospital,Rajnikanth,Rajinikanth Health News,Rajinikanth News,Mango News,Mango News Telugu,Rajinikanth Progressing Well,Decision Tomorrow On Discharge,Actor Rajinikanth Recovering Well,Decision On Discharge Tomorrow

ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌ అస్వస్థతతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం శనివారం ఉదయం ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేయగా, శనివారం సాయంత్రం మరోసారి హెల్త్‌ బులెటెన్‌ విడుదల చేసింది. “రజనీకాంత్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఈ రోజు జరిపిన కొన్ని వైద్యపరీక్షల నివేదికలు వచ్చాయి మరియు వాటిలో ఆందోళన కలిగించేది ఏమీ లేదు. మిగిలిన వైద్యపరీక్షల నివేదికలు మరియు రాత్రిపూట ఆయన రక్తపోటు స్థితి ఆధారంగా ఆయన్ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ విషయంపై రేపు నిర్ణయం తీసుకుంటాం” అని అపోలో ఆసుపత్రి తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమైనందున సందర్శకులను ఆయన్ని కలవడానికి అనుమతించడం లేదు. ఆసుపత్రిలో రజనీకాంత్‌ వెంట ఆయన కూతురు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =