ఒక్కరోజే దేశవ్యాప్తంగా 50 లక్షల ఫాస్టాగ్ లావాదేవీలు, రికార్డు స్థాయిలో రూ.80 కోట్లు వసూలు

FASTag Toll Collection Crosses Rs 80 Cr in One Day for the First Time,FASTag Toll Collection Crosses Rs 80 Cr In One Day,Records 50 Lakh Transactions,FASTag Toll Collection Crosses Rs 80 Cr Per Day For First Time,FASTag Toll Collection Crosses Rs 80 Cr Per Day,FASTag Toll Collection Crosses Rs 80 Cr,FASTag Collection Crosses Rs 80 Cr,User Fee Collection Through FASTag Crosses Rs 80 Cr Per Day,First Time FASTag Toll Collection Crosses Rs 80 Cr Per Day,FASTag,FASTag Toll,FASTag News,FASTag Latest News,Mango News,Mango News Telugu,FASTag Toll Collection Crosses Rs 80 Cr,FASTag Toll Collection,FASTag Collection,FASTag Toll Collection Rs 80 Cr

జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్‌ ద్వారా డిసెంబర్ 24, బుధవారం నాడు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 50 లక్షల ఫాస్టాగ్ లావాదేవీలు జరగడంతో టోల్ వసూలు మొదటిసారిగా 80 కోట్ల రూపాయలు దాటినట్టు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది. ఫాస్టాగ్ ద్వారా ఒక్కరోజులోనే రూ.80 కోట్లు వసూలు అవ్వడాన్ని చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు. ఇప్పటి వరకు మొత్తం 2.20 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేసినట్టు తెలిపారు.

దేశంలో టోల్​గేట్ల వద్ద ట్రాఫిక్​ను ​నియంత్రించడంతో పాటుగా డిజిట‌ల్‌, ఐటి ఆధారిత చెల్లింపుల‌ను ప్రోత్స‌హించే లక్ష్యంతో 2016 లో ఫాస్టాగ్స్ ప్రారంభించబడ్డాయి. ఫాస్టాగ్ ద్వారా ప్రయాణికులు నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని, ఈ విధానం సమయం మరియు ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అన్ని 4 చక్రాల వాహనాలకు జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేయడంతో దేశంలో అన్ని టోల్ ప్లాజాల వద్ద ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే అన్ని అవసరమైన ఏర్పాట్లు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + five =