తెలంగాణ స్టేట్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్‌బాస్ ఫేమ్ అలేఖ్య హారిక నియామకం

Bigg Boss Fame Dethadi Harika, Bigg Boss Fame Dethadi Harika Appointed as Telangana State Tourism Brand Ambassador, Dethadi Harika, Dethadi Harika Appointed as Telangana State Tourism Brand Ambassador, Dethadi Harika Appointed as Telangana Tourism Brand Ambassador, Dethadi Harika Appointed as Tourism Brand Ambassador, Mango News, Telangana State Tourism Brand Ambassador, Telangana State Tourism Brand Ambassador Dethadi Harika, Telangana Tourism Brand Ambassador, Tourism Brand Ambassador Dethadi Harika

తెలంగాణ స్టేట్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌ గా బిగ్‌బాస్ ఫేమ్ అలేఖ్య హారిక నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌టీడీసీ) చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా వివరాలను వెల్లడించారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నాడు ఒక కార్యక్రమంలో హారికకు నియామకం పత్రాన్ని ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అందజేశారు. “మన తెలంగాణ మహిళా, బిగ్‌బాస్ ఫేమ్ అలేఖ్య హారికను తెలంగాణ స్టేట్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ నియమించాం. ఆల్ ది బెస్ట్ హరిక. మీరు ఈ పాత్రకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను” అని ఉప్పల శ్రీనివాస్ ట్వీట్ చేశారు. టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన హరికకు పలువురు అభినందనలు తెలియజేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here