తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు, సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్ రావు

BRS Leader Minister Harish Rao Extends Birthday Wishes to Telangana CM KCR,BRS Leader Minister Harish Rao,Extends Birthday Wishes,Telangana CM KCR,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

“సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు..తెలంగాణ ప్రజలకు స్వేఛ్చా వాయువులు ప్రసాదించిన శేఖరుడు..కాళేశ్వర గంగను దివి నుంచి భువికి దించిన అపర భగీరథుడు..తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు..అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు. కేసీఆర్ అంటే కారణజన్ముడుగా…చిరస్మరణీయుడుగా ప్రజల తల రాతలను మార్చే మహనీయుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి..గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here