తెలంగాణలో ముగిసిన గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ, 783 పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారంటే?

Telangana: Group-2 Application Process Closed TSPSC likely to Announce Exam Schedule Soon,Telangana Group-2 Application Process,TSPSC Exam Schedule Soon,Telangana Group- 2 Exams,Mango News,Mango News Telugu,TSPSC Releases Group-2 Notification,TSPSC Group-2 Notification,TSPSC Notification,Group 2 Notification 2022 Telangana,Groups Notification 2022 Telangana,Group 4 Jobs Notification 2022 Telangana,Group 4 Jobs List In Telangana 2022 Notification,Group 4 Posts In Telangana 2022 Notification,Group 4 Notification 2022 Telangana Eligibility,Group 4 Notification 2022 Telangana Syllabus In Telugu,Group 4 Notification 2022 Telangana In Telugu,Telangana State Group 4 Notification 2022,Group 4 Notification 2022 Telangana Apply Online

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16, గురువారంతో ముగిసింది. 783 గ్రూప్‌-2 పోస్టులకు గానూ మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తెలిపింది. గ్రూప్-2 పరీక్ష విధానంలో నాలుగు పేపర్స్ ఉండగా, త్వరలోనే గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించనుంది.

ముందుగా గ్రూప్-2 కింద 783 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ) 2022, డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్, నాయిబ్‌ తహసీల్దార్‌ సహా పలు విభాగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులంతా కమిషన్ వెబ్‌సైట్‌ లో https://.tspsc.gov.in/ లో ఉంచే నిర్ణిత ప్రొఫార్మాలో జనవరి 18వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అయితే చివరి మూడు రోజుల్లోనే లక్షకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో గ్రూప్-2 కి సంబంధించి ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడనున్నారు.

గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ కింద భర్తీ చేసే పోస్టుల వివరాలు (783):

  1. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3 – 11 పోస్టులు
  2. అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్ – 59
  3. నాయిబ్‌ తహసీల్దార్‌ – 98
  4. సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2 – 14
  5. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ – 63
  6. అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్ – 09
  7. మండల పంచాయతీ అధికారి (ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌) – 126
  8. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్ – 97
  9. అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ – 38
  10. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) – 165
  11. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేటివ్ సెక్రటేరియట్) – 15
  12. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ డిపార్ట్మెంట్) – 25
  13. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా డిపార్ట్మెంట్) – 07
  14. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ( తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్) – 02
  15. డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ గ్రేడ్-2 – 11
  16. అసిస్టెంట్‌ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ – 17
  17. అసిస్టెంట్‌ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్‌ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ – 09
  18. అసిస్టెంట్‌ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్‌ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ – 17.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + nineteen =