బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం 33 జిల్లాలకు ప్రత్యేక బృందాలు – వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

BRS Party Working President KTR Appointed Special Teams for 33 Districts for Coordination of Party Activities,BRS Party Working President KTR,KTR Appointed Special Teams,KTR Special Teams for 33 Districts,KTR on Coordination of Party Activities,Mango News,Mango News Telugu,KTR Appoints Special Coordination Team,KTR Appoints Team of Senior Leaders,KTR gets Campaign Machinery,BRS Party, Telangana Latest News And Updates,KTR Latest News,Telangana Special Teams News Updates,Hyderabad News,Telangana News

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్టీ శ్రేణులు అందర్నీ ఏకం చేసేలా విస్తృతంగా చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటుగా డా.బీ.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ మరియు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను రానున్న మూడు నాలుగు నెలల పాటు పార్టీ విస్తృతంగా చేపట్టేందుకు నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు ఒక కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా కేటీఆర్ ఆదివారం నాడు పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రత్యేకంగా పార్టీ తరఫున ఏర్పాటుచేసిన ఈ బృందం, జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాల అమలును సమన్వయం చేస్తుందని చెప్పారు. ఈ మేరకు పార్టీ నియమించిన నాయకులు తమకు బాధ్యతలు అప్పజెప్పిన జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశమై పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక మరియు అమలుపైన చర్చించాలని కేటీఆర్ సూచించారు. పార్టీ శ్రేణులు ఈ బృందంతో కలిసి సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

33 జిల్లాల‌ ప్ర‌త్యేక బృందాల యొక్క వివరాలు:

  • వనపర్తి, జోగులాంబ గద్వాల – ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు
  • మేడ్చల్ మల్కాజ్ గిరి – ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • కరీంనగర్, రాజన్న సిరిసిల్ల – ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
  • నల్గొండ – ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
  • వికారాబాద్ – ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
  • రంగారెడ్డి – ఎమ్మెల్సీ ఎల్.రమణ
  • భద్రాద్రి కొత్తగూడెం – ఎమ్మెల్సీ భానుప్రసాద్
  • సంగారెడ్డి – ఎమ్మెల్సీ వెంకట్ రామ్ రెడ్డి
  • మెదక్ – ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం
  • మహబూబ్ నగర్, నారాయణపేట – ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి
  • యాదాద్రి భువనగిరి – ఎమ్మెల్సీ డా.యాదవ రెడ్డి
  • నాగర్ కర్నూల్ – ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
  • భూపాలపల్లి, ములుగు – మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి
  • సిద్దిపేట – జనరల్ సెక్రెటరీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు
  • హనుమకొండ, వరంగల్ – ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఎమ్.ఎస్ ప్రభాకర్
  • నిర్మల్, ఆదిలాబాద్ – ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్
  • మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్
  • జనగామ – ఎమ్మెల్సీ కోటిరెడ్డి
  • మహబూబాబాద్ – మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్
  • కామారెడ్డి – ఎమ్మెల్సీ దండే విఠల్
  • నిజామాబాద్ – ఎమ్మెల్సీ బండ ప్రకాష్
  • జగిత్యాల – పార్టీ సెక్రెటరీ కోలేటి దామోదర్
  • పెద్దపల్లి – కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
  • హైదరాబాద్ – సీనియర్ నాయకుడు డా.దాసోజు శ్రావణ్
  • ఖమ్మం – ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
  • సూర్యాపేట – కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 4 =