వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023 ఫైనల్ కు చేరిన భారత్ జట్టు, జూన్ 7న ఆస్ట్రేలియాతో డీ

India Qualified to ICC World Test Championship-2023 Final will Face Australia at the Oval Starting on June 7,India Qualified to ICC World Test,ICC World Test Championship-2023 Final,India will Face Australia at the Oval,World Test Championship-2023 on June 7,Mango News,Mango News Telugu,India Qualify for World Test Championship Final,Team India To Face Australia,India to face Australia in the 2023,World Test Championship Final 2023,Team India Qualifies For WTC Final,India vs Australia,ICC World Test Championship 2023 News,ICC World Test Championship 2023 Updates,ICC World Test Latest News and Updates

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)-2023 ఫైనల్ కు భారత్ జట్టు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ కు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే చేరుకోగా, ఇంకో స్థానం కోసం భారత్, శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకుంది. అయితే న్యూజిలాండ్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మొదటి టెస్టులో శ్రీలంక జట్టు ఓడిపోవడంతో, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు ఫలితం తేలకముందే భారత్ జట్టుకు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ బెర్త్ ఖరారయింది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2023/రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుండి 11 వరకు లండన్‌ లోని ఓవల్‌ స్టేడియంలో జరుగనుండగా, ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించారు. సౌతాంప్టన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్-2021 ఫైనల్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకుంది.

మరోవైపు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ జట్టు 2-1 తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో 2-1 తో ఆధిక్యాన్ని సాధించడంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్ కు చేరడానికి మార్గం సుగమం చేసుకుంది.

కాగా ప్రస్తుత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 సైకిల్/సీజన్ 2021, జూలై నుండి 2023 జూన్ వరకు నడువనున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి తొమ్మిది టెస్ట్ జట్లు పాల్గొంటుండగా, ఒక్కొక్కటి ఆరు సిరీస్‌లను (మూడు స్వదేశంలో మరియు మూడు బయట) ఆడుతున్నాయి. ఈ సీజన్ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, భారత్ జట్లు డబ్ల్యూటీసీ-2023 ఫైనల్‌లో తలపడనున్నాయి. ఆస్ట్రేలియా 66.67 పర్సెంటేజ్ తో (152 పాయింట్స్) మొదటి స్థానంలో, భారత్ జట్టు 58.8 పర్సెంటేజ్ తో (127 పాయింట్స్) రెండో స్థానంలో నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 5 =