మార్కెట్లో అమ్ముడయ్యే పంటలనే సాగు చేసే అలవాటు రైతుల్లో రావాలి- సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Appeals the Farmers to Cultivating Crops, Crop Cultivation Model, Crop Cultivation Policy, Cultivating Crops which are in Demand, KCR Appeals the Farmers to Cultivating Crops In Demand, KCR Meeting On Crop Cultivation Policy, KCR To Decide Crop Cultivation Model, Telangana Crop Cultivation Model

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈసారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తుందని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని చెప్పారు. అంతిమంగా రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు.

దేశంలో, రాష్ట్రంలో ఆహార భద్రత సాధించగలిగినప్పటికీ, పోషకాహార భద్రత సాధించలేదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్థకమైన ఆహారం తినడం లేదని, అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అలాంటి పంటలు పండించాలని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు, రోగ నిరోధక శక్తి పెరగాలని సీఎం ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్ చేసిన పలు సూచనలు:

 

• రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు ఖచ్చితమైన అంచనాలు రూపొందించాలి. రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాంతానికి ఏ ఆహార పదార్థాల అవసరం ఉందో గమనించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలి. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కావద్దు. నిరంతరం సాగుతుంది. దీనికోసం ప్రభుత్వం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీని నియమిస్తుంది. నిపుణుల, నిష్ణాతులను ఈ కమిటీలో నియమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ – మార్కెటింగ్ – ధరలు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఏ పంటలు వేయడం వల్ల లాభం కలుగుతుందో సూచిస్తుంది. దాని ప్రకారం పంటల సాగు చేపట్టాలి.

• వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెరగడం కూడా చాలా ముఖ్యం. సాగు పద్ధతుల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు అవలంభించాలి. ఎరువులు, పురుగు మందుల వాడకంలో కూడా శాస్త్రీయత ఉండాలి. మేలు రకమైన విత్తనాలు వేయాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలి. యాంత్రీకరణకు అనుగుంగా సాగు జరగాలి. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, తగు సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం అగ్రికల్చర్ రీసెర్చి కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ సూచించిన విధంగా సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలి.

• తెలంగాణలో పత్తి పంట ఎక్కువ పండిస్తున్నారు. పత్తిలో ఉత్పాదకత పెంచడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఏ రకమైన పత్తికి మార్కెట్ ఉంది? అలాంటి పత్తి సాగు చేయాలంటే ఏం చేయాలి? తదితర విషయాలను అధ్యయనం చేసి, తగు సూచనలు ఇవ్వడానికి, పత్తి రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రభుత్వం కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది.

• తెలంగాణలో పండే పత్తికి మంచి డిమాండ్ ఉంది. నూలు పొడవు ఎక్కువ ఉండడం వల్ల మంచి ధర వస్తుంది. అయితే పత్తిలో మట్టి, పుల్లలు, ఇతర చెత్త కలవడం వల్ల సరుకులో నాణ్యత (ఫేర్ ఆవరేజ్ క్వాలిటీ – ఎఫ్.ఎ.క్యూ.) శాతం పడిపోయి, ధర తగ్గుతున్నది. కష్టపడి పంట పండించే రైతులు పత్తి ఏరిన తర్వాత అందులో చెత్తా చెదారం కలవకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో రైతులకు అవగాహ కల్పించాలి.

• రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులు, స్పిన్నింగ్ మిల్లుల సామర్థ్యంపై ఖచ్చితమైన అంచనాలు వేయాలి. సరిపోను ఉన్నాయా? ఇంకా నెలకొల్పాలా? అనే విషయంపై శాస్త్రీయమైన అంచనా ఉండాలి. పత్తి పంట పండే ప్రాంతాల్లోనే ఇవి నెలకొల్పడం వల్ల రవాణా వ్యయ, ప్రయాసలు కూడా తప్పుతాయి.

• తెలంగాణలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలున్నాయి. ఏ నేలలు ఏ పంట సాగుకు అనువైనవో తేల్చాలి. దానికి అనుగుణంగా పంటల సాగు చేపట్టాలి. పంటల కాలనీల ఏర్పాటు కోసం నేలల విభజన చేయాలి. ఈ వివరాలను రైతులకు తెలపాలి.

• ప్రజలు నిత్యం తినే పండ్లు, కూరగాయలను రాష్ట్రంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఏఏ రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకంటున్నామో లెక్కలు తీయాలి. వాటిని మన రాష్ట్రంలోనే పండించాలి. పండ్లు, కూరగాయల విషయంలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే పట్టణ ప్రాంతాల పరిసరాల్లోని భూముల్లో పండ్లు, కూరగాయల సాగుకు అనువైన నేలలను గుర్తించి, రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది.

• ఆలుగడ్డలు, అల్లం, ఎల్లిపాయలను ప్రజలు ఎక్కువగా వాడతారు. వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలోనే వాటిని పండించాలి. ఎక్కడ పండించాలి? మేలైన సాగు పద్ధతులేంటి? తదితర విషయాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి.

• ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ప్రతీ ఏడాది అనిశ్చితి, అస్పష్టత ఉంటుంది. ఇలా ఎందుకుండాలి? తెలంగాణ ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలి. ఎప్పుడూ కొరత లేకుండా చూసే వ్యూహం అవలంభించాలి.

• చిక్కుడు, మునగలో మంచి పోషకాలు ఉన్నాయి. వాటిని ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్య పరచాలి. వాటి సాగు పెంచాలి.

• రాష్ట్రంలో కొత్తగా అనేక ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. మిషన్ కాకతీయతో చెరువుల నీటి సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యుత్ వల్ల బోర్ల ద్వారా సాగు పెరిగింది. దీంతో ప్రతీ ఏటా కొత్తగా ఆయకట్టు పెరుగుతూ వస్తున్నది. పెరిగిన/పెరిగే విస్తీర్ణాన్ని సరిగ్గా అంచనా వేస్తూ, పంటల సాగు ప్రణాళికలు తయారు చేయాలి.

• హర్టికల్చర్ డిపార్టుమెంటును మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి.

• సరైన పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేకంగా స్టాటిస్టికల్ విభాగం ఏర్పాటు చేయాలి.

ఈ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, అగ్రో బిజినెస్ కన్సల్టెంట్ గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
Minister Harish Rao Strong Counter To TPCC Chief Uttam Kumar Reddy | Telangana Politics | Mango News
02:13
Video thumbnail
Congress MP Komatireddy Venkat Reddy Strong Warning To Police | Telangana Politics | Mango News
03:36
Video thumbnail
MP Revanth Reddy Serious Comments On CM KCR After Releasing From Jail | Telangana News | Mango News
04:17
Video thumbnail
Telangana Formation Day Grand Celebrations At Pragathi Bhavan | #TSFormationDay | Mango News
02:48
Video thumbnail
Minister KTR Participates In Telangana Formation Day Celebrations | Telangana News | Mango News
02:20
Video thumbnail
CM KCR Pays Homage To Telangana Martyrs At Gun Park | Telangana Formation Day | Mango News
04:00
Video thumbnail
Governor Tamilisai Soundararajan Wishes People On Telangana Formation Day | TS News | Mango News
01:32
Video thumbnail
Minister Errabelli Dayakar Serious Warning To People For Not Wearing Mask | #CoronaVirus | MangoNews
05:57
Video thumbnail
Jagga Reddy Says Revanth Reddy Fans Spreading False Propaganda On Uttam Kumar Reddy | Mango News
07:18
Video thumbnail
Congress MP Revanth Reddy Funny Jokes With Reporters In LIVE | Telangana Lockdown | Mango News
04:48
Video thumbnail
CM KCR & Minister Harish Rao Struggle To Help Telangana Farmers | #KondapochammaSagar | Mango News
08:34
Video thumbnail
CM KCR & Minister KTR Special Effort To Help Telangana Farmers | #KondapochammaSagar | Mango News
12:12
Video thumbnail
CM KCR Says Kondapochamma Sagar Is A Dream Project In Telangana History | Telangana News | MangoNews
05:02
Video thumbnail
Exclusive Visuals Of Kondapochamma Sagar Reservoir With Godavari Water | #KCR | TS News | Mango News
10:56
Video thumbnail
CM KCR & Chinna Jeeyar Swamy Inaugurates Kondapochamma Sagar Reservoir | Telangana News | Mango News
05:51
Video thumbnail
CM KCR Performs Nava Chandi Yagam At Kondapochamma Temple | Telangana News | Mango News
13:20
Video thumbnail
CM KCR Press Meet LIVE | CM KCR Key Decision Over Lockdown Updates | #TelanganaLockdown | Mango News
02:00:53
Video thumbnail
Ministers KTR & Harish Rao Special Affection Towards Farmers | KTR Vs Harish Rao | #TRS | Mango News
14:34
Video thumbnail
CM KCR Sensational Decision Over Drinking Water Issue In Rayalaseema | #KCRPressMeet | Mango News
06:25
Video thumbnail
Minister KTR Fires On Congress Leaders | #RythuVedika | TRS Vs Congress | Telangana News | MangoNews
07:26
Video thumbnail
KTR చేసిన పని చూస్తే సెల్యూట్ చేస్తారు | Minister KTR Cleaned His House Personally | Mango News
03:22
Video thumbnail
Minister Harish Rao Participates In Dry Day Activity At Siddipet | #TelanganaLockdown | Mango News
02:21
Video thumbnail
MLA Jagga Reddy Lashes Out CM KCR Over Cultivation Of Crops In Press Meet | Congress | Mango News
10:02
Video thumbnail
Minister Harish Rao About CM KCR's Decision Over Helping Farmers | Telangana News | Mango News
07:25
Video thumbnail
Minister Harish Rao Superb Speech About Farmers | #CMKCR | Telangana Latest News | Mango News
04:29
Video thumbnail
CM KCR Suggests Telangana Farmers Over Cultivation Of Crops | #TelanganaLockdown | Mango News
06:26
Video thumbnail
CM KCR Special Orders Over Cultivation Of Crops In Telangana | Telangana Latest News | Mango News
07:23
Video thumbnail
CM KCR Speaks About Greatness Of Migrant Workers In Telangana | #TelanganaLockdown | Mango News
07:02
Video thumbnail
CM KCR Serious On Reporter In Press Meet | Lockdown 4.0 Guidelines | Telangana News | Mango News
05:00
Video thumbnail
CM KCR Superb Answer For Reporter Question In LIVE | #KCRPressMeet | Lockdown Update | Mango News
08:19
Video thumbnail
CM KCR Says Telangana Is Breaking All State Records Over Production Of Crops | TS News | Mango News
07:32
Video thumbnail
MP Revanth Reddy Request Congress Activists To Help Migrant Workers | Telangana News | Mango News
08:24
Video thumbnail
CM KCR Speaks About PM Modi's 20 Lakh Crores Of Economic Package | Lockdown Updates | Mango News
07:06
Video thumbnail
CM KCR Sensational Comments On Modi's 20 Lakh Crores Economic Package | #KCRPressMeet | Mango News
07:22
Video thumbnail
CM KCR Gives Green Signal For Bus Services In Telangana | Lockdown 4.0 Guidelines | Mango News
03:26
Video thumbnail
CM KCR Gives Clarity Over Containment And Green Zones In Telangana | Lockdown Updates | Mango News
05:58

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − six =