టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గా గ్యాదరి బాలమల్లు పదవీకాలం మరో మూడేళ్లు పొడిగింపు, సీఎం కేసీఆర్ నిర్ణయం

CM KCR Decides to Extends Tenure of TSIIC Chairman Gyadari Balamallu for Another 3 Years, TSIIC Chairman Gyadari Balamallu for Another 3 Years, CM KCR Decides to Extends Tenure of TSIIC Chairman, TSIIC Chairman Gyadari Balamallu, Mango News, Mango News Telugu, TSIIC Chairman, Gyadari Balamallu, CM KCR TSIIC Chairman Gyadari Balamallu, Telangana CM KCR, Telangana State Industrial Infrastructure Corporation, TSIIC Chairman Latest News And Updates, TSIIC News And Live Updates, Gyadari Balamallu Is New TSIIC Chairman

తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ కార్పోరేషన్‌ (టీఎస్‌ఐఐసీ) చైర్మన్‌ గా కొనసాగుతున్న గ్యాదరి బాలమల్లు పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గ్యాదరి బాలమల్లు శుక్రవారం ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గా తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు కూడా గ్యాదరి బాలమల్లుకు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటకు చెందిన గ్యాదరి బాలమల్లు గత ఆరేళ్లుగా టీఎస్‌ఐఐసీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here