ఏపీ ‘స్వఛ్చ సర్వేక్షణ్‌’ అవార్డు గ్రహీతలను అభినందించిన సీఎం జగన్‌

AP CM YS Jagan Congratulates The Winners of Swachh Survekshan Awards, AP CM YS Jagan Congratulates Swachh Survekshan Awardees , Swacch Sarvekshan 2022 Awards, Swachh Survekshan Grameen, Swachh Bharat Mission, Andhra Pradesh Secures 12 Awards In Sanitation, Waste Management, Andhra Pradesh Bags Swachh Survekshan Awards, Mango News, Mango News Telugu, Swachh Survekshan, Swachh Survekshan 2022, Andhra Pradesh Swachh Survekshan, Swachh Survekshan Latest News And Updates, Andhra Pradesh News And Live Updates

‘స్వఛ్చ అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ కేటగిరీల్లో 11 అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అవార్డులను గెలుచుకున్న ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు తదితరులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినిందించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఇదే తరహా పనితీరుని కొనసాగించాలని అవార్డు పొందిన విజేతలను సీఎం జగన్‌ కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, సీనియర్ అధికారిణి శ్రీలక్ష్మి, శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌తో పాటు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌లు, అధికారులు, పులివెందుల, పుంగనూరు, పొదిలి, సాలూరు చైర్‌పర్సన్‌లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here