ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, రూ.50 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Cm Kcr Expressed Deep Shock On The Death Of Forest Range Officer Srinivasa Rao Announces An Ex-Gratia Of Rs.50 Lakhs,Cm Kcr Shocked By Death Of Forest Range Officer,Forest Range Officer Srinivasa Rao,Srinivasa Rao,Announces Exgratia Rs.50 Lakhs,Mango News,Mango News Telugu,Fro Death,Kcr Announces An Ex-Gratia,Tjfoa Condemns Attack On Forest Ranger,Telangana Forest Ranger Srinivasa Rao,Telangana Forest Ranger,Telangana Forest Ranger Death,Telangana Forest Ranger Latest News And Updates,Telangana Cm Kcr

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరణించిన ఎఫ్.ఆర్.ఓ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాస రావు డ్యూటీలో వుంటే ఏవిధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అలాగే కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎఫ్.ఆర్.ఓ పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ లు ఎఫ్.ఆర్.ఓ అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సీఎం ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా వుంటుందని, ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − ten =