స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాల‌కు రూ.5 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

CM KCR Expressed Shock Over Blaze Mishap at Secunderabad Swapnalok Complex Ex-gratia for Rs 5 Lakh Each Deceased,CM KCR Expressed Shock Over Blaze Mishap,Blaze Mishap at Secunderabad,Secunderabad Swapnalok Complex Blaze Mishap,CM KCR Ex-gratia For Rs 5 Lakh Each Deceased,Swapnalok Complex Blaze Mishap Ex-gratia,Mango News,Mango News Telugu,Secunderabad fire Accident,Massive Fire Mashup at Swapnalok Complex,Swapnalok Complex Secunderabad,Four Women Lost Lives in Massive Fire Mashup,Secunderabad Fire Mashup News Today,Secunderabad Swapnalok Complex Live News,Secunderabad Fire Accident Live News,Secunderabad Fire Accident Live Updates,CM KCR Secunderabad Ex-gratia News,CM KCR Latest Updates

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మరణించినవారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 20 =