బతుకమ్మ పండుగ ఆఖరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

CM KCR Extend Greetings to People of Telangana on the occasion of Saddula Bathukamma the Last Day of Bathukamma Festival, Saddula Bathukamma, Last Day of Bathukamma Festival, CM KCR Extend Greetings Saddula Bathukamma, Mango News, Mango News Telugu, Telangana Govt Bathukamma Sarees, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Celebration, Telangana Bathukamma Celebration, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Latest News And Updates, Telangana Govt News And Live Updates

రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు ‘సద్దుల బతుకమ్మ’ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల మధ్య ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటా పాటలతో, పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. విజయాలనందించే విజయదశమిని స్వాగతిస్తూ ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లేలా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా దీవించాలని మరోసారి అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =