ఫలించిన ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల, చిన్నారికి నామకరణం చేసిన సీఎం కేసీఆర్‌

CM KCR Named Girl at Pragati Bhavan Fulfills Her Parents Nine Years Wish, CM KCR Named Girl at Pragati Bhavan, KCR Fulfills Nandigama Couple's Wish, 9 Year Old Girl Finally Named By Cm Kcr, Nine Year Old Named By KCR , Mango News, Mango News Telugu, Telangna Pragati Bhavan, Telangna CM KCR, Pragati Bhavan, CM KCR, CM KCR Latest News And Updates, CM KCR Named 9 Year Girl, CM KCR Names Nine Year Girl, Telangna News And Live Upates

తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్, అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి, నేటి సీఎం కేసీఆర్ తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి ఆ తల్లిదండ్రులను, బిడ్డను ఆదివారం ప్రగతి భవన్ కు తోడ్కొని వచ్చారు.

ఈ విషయం తెలసుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, సురేష్, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు ‘మహతి’ అని నామకరణం చేసారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచ్చారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, వూహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు సురేష్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్ దంపతులకు తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here